Don't Miss!
- Sports
Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
VT 12: 'గాండీవదారి అర్జున' ఫస్ట్ లుక్ అదిరింది.. యాక్షన్ హీరోగా వరుణ్ తేజ్ హై వోల్టేజ్ లుక్!
మెగా హీరో వరుణ్ తేజ్ ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చేస్తూనే మరొకవైపు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమాకు మళ్ళీ తదుపరి సినిమాకు ఏ సంబంధం ఉండకూడదు అని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇక చివరిగా అతను గని అనే యాక్షన్స్ స్పోర్ట్ సినిమాతో పాటు ఆ తర్వాత కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ F3 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక ఇప్పుడు మరింత విభిన్నంగా ఒక యాక్షన్ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ 12వ సినిమా తెరపైకి రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఖైదీ సినిమాకు గాండీవ దారి అర్జున అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక సినిమాలో వరుణ్ తేజ్ ఒక యాక్షన్ పాత్రలో కనిపించబోతున్నట్లు అనిపిస్తోంది.

మోషన్ పోస్టర్ చూస్తేనే ఈ సినిమా మేకింగ్ విధానం హై లెవెల్ లో ఉండబోతున్నట్లు కూడా అనిపిస్తోంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు గరుడవేగ సినిమాతో మంచి గుర్తింపు అందుకొని ఆ తర్వాత నాగార్జునతో ది గోస్ట్ అనే సినిమాను తెరపై తీసుకువచ్చాడు. కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ తో విభిన్నమైన యాక్షన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.
Keeping peace is a bloody business!🔥#GandeevadhariArjuna@PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/HQQxaZ65oV
— Varun Tej Konidela (@IAmVarunTej) January 19, 2023
ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ SVCC బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలాగే కొణిదెల నాగబాబు కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తిచేసి. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. త్వరలోనే సినిమా పూర్తి క్యాస్ట్ తో పాటు పూర్తి టెక్నీషియన్స్ వివరాలను తెలియజేయనున్నారు.