Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
దిల్ రాజుకు షాకిచ్చిన మెగా హీరో.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఉండడం వల్లే ఇలా!
కెరీర్‌ను స్లోగా స్టార్ట్ చేసినా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. బడా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు బాగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఇటీవల 'గద్దలకొండ గణేష్'తో భారీ విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో.. త్వరలోనే ప్రారంభం కాబోతున్న 'F3'లో నటించబోతున్నాడు. గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'F2'కు ఇది సీక్వెల్‌గా వస్తోంది.
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటించిన ఈ మల్టీ స్టారర్ మూవీ 'F2'. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ తీస్తున్నారు. 'F3' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మెగా హీరో వరుణ్ తేజ్.. రెమ్యూనరేషన్ విషయంలో దిల్ రాజుకు షాకిచ్చాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

'F2' సమయంలో తనకు ఉన్న మార్కెట్‌ను బట్టి చార్జ్ చేసిన వరుణ్ తేజ్.. ఇప్పుడు వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. దీంతో ఈ సారి తన రెమ్యూనరేషన్ పెంచాల్సిందేనని దిల్ రాజును డిమాండ్ చేస్తున్నాడట. దీంతో సదరు నిర్మాత ఆలోచనలో పడిపోయాడని తెలుస్తోంది.
ఇందులో నటించిన మిగతా హీరో హీరోయిన్లతో పాటు దర్శకుడు కూడా వరుణ్ బాటలోనే పయనిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం 'F3'కి దిల్ రాజు బడ్జెట్‌ను భారీగా పెంచాల్సిందేనన్న మాట. ఇదిలా ఉండగా, ప్రస్తుతం వరుణ్ తేజ్ 'బాక్సర్' అనే మూవీ చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని అల్లు బాబీ నిర్మిస్తున్నాడు.