కోట్ల ఆస్తి ఉన్నా.. పేదరికంలో మృణాల్ ఠాకూర్.. షాకింగ్ న్యూస్?
తెలుగు ప్రేక్షకుల్లో నటి మృణాల్ ఠాకూర్ మంచి గుర్తింపు దక్కించుకుంది. తన అందం, అభినయంతో మృణాల్ ఠాకూర్ ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకుంది. సీతారామం చిత్రం మృణాల్ ఠాకూర్ దక్షిణాదిన ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగింటి అమ్మాయిలానే మృణాల్ ఠాకూర్ ఆకట్టుకుంది. ఆ చిత్రం తర్వాత నుంచి మృణాల్ ఠాకూర్ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు అందుకుంటూనే వస్తోంది. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ఉంది.
అయితే, మృణాల్ ఠాకూర్ గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మృణాల్ ఠాకూర్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంత స్టైలిష్ గా, ఎంత బ్యూటీఫుల్ గా మెరుస్తూ ఉంటుందో తెలిసిందే. ఇక మృణాల్ ఠాకూర్ తన డైలీ లైఫ్ లో చాలా రిచ్ గానే కనిపిస్తుటుంది. అయితే ఆమె ఖరీదైన డ్రెస్ ల్లో కనిపిస్తూ ఫొటో షూట్లు కూడా చేస్తూ తన అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ తన గురించి షాకింగ్ విషయం బయటికి వెల్లడింది.

మృణాల్ ఠాకూర్ ఖరీదైన దుస్తులు కొనుగోలు చేసేందుకు అస్సలు ఇష్టపడదంట. ఎంత ఖరీదు పెట్టి బట్టలు కొన్నా కూడా వాటిని ఎలాంటి ఉపయోగం లేకుండా వార్బ్రోబ్ లోనే దాచి ఉంచాల్సి వస్తుందని తన అభిప్రాయం. ఇక ఇప్పటి వరకు తనకు కొనుగోలు చేసిన డ్రెస్ అత్యధిక ధర కేవలం రూ.2000 అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పడం షాకింగ్ గా మారింది. స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి అంత తక్కువ ధరలో డ్రెస్ కొనుగోలు చేయడం ఏంటని సందేహిస్తున్నారు.
అయితే మృణాల్ ఠాకూర్ సినీ ఈవెంట్లు, ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు కూడా లక్షల్లో ఖరీదైన దుస్తులు ధరిస్తూ ఉంటారు. అయితే అవన్నీ రెంటెడ్ ద్వారానే తీసుకొని ధరిస్తుందంట. తనకు అత్యధిక ధర కలిగిన దుస్తులు కొనుగోలు చేయడం అస్సలు ఇష్టం ఉండదంట. బదులుగా ఆ డబ్బులను ఫూడ్, ప్రాపర్టీస్ మీద ఎక్కువగా ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చింది. ఏదేమైనా మృణాల్ ఠాకూర్ తన గురించి చెప్పిన షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక మృణాల్ ఠాకూర్ మరాఠి ఫ్యామిలీలో పుట్టి పెరిగింది. ప్రస్తుతం ఆమె వయస్సు 33 ఏళ్లు కావడం విశేషం. 1992 ఆగస్టు 1న జన్మించింది. 2018 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తోంది. తొలుత బాలీవుడ్ లో ఆ తర్వాత, టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. 10 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంది. టాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్ నేచురల్ స్టార్ నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టర్ సినిమాల్లో నటించింది. అలాగే ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక నెక్ట్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం AA22xA6లో కీలక పాత్రలో నటిస్తూ ఉంది. మరోవైపు అడివి శేష్ డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ, హిందీలో 3 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











