twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను సూసైడ్ చేసుకోవాలనుకొన్నా.. బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత.. హీరోయిన్ నందినీ రాయ్

    |

    సుశాంత్ మరణం తర్వాత ప్రతీ ఒక్కరు డిప్రెషన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. డిప్రెషన్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోననే విషయాన్ని పలువురు తమ అభిప్రాయాలను, దానికి పరిష్కారాలను సూచిస్తున్నారు. దీపిక పదుకోన్ లాంటి టాప్ హీరోయిన్లు మెంటల్ హెల్త్ గురించి వివరంగా తమ భావాలను పంచుకొంటున్నారు. ఈక్రమంలో టాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ సెలబ్రిటీ నందనీ రాయ్ తాను కూడా పలుమార్లు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వెంటాడాయని వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

    2015లో టాలీవుడ్‌లోకి

    2015లో టాలీవుడ్‌లోకి

    యువ హీరోయిన్ నందినీ రాయ్ 2015లో మోసగాళ్లకు మోసగాడు అనే చిత్రంలో హీరో సుధీర్ బాబుతో కలిసి నటించడం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ సినిమా అంతగా విజయవంతం కాకపోవడం, ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఆఫర్లు ముఖం చాటేశాయి. దాంతో తాను తీవ్రమైన డిప్రెషన్ లోనయ్యాయని నందినీ రాయ్ చెప్పారు.

    కెరీర్ పరంగా అభద్రతాభావం

    కెరీర్ పరంగా అభద్రతాభావం


    సినిమా పరిశ్రమలో సక్సెస్‌తో వచ్చే పాపులారిటీ రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది. విజయాలు లభిస్తున్న క్రమంలో కెరీర్‌పరంగా అభద్రతాభావం పెరుగుతుంది. ప్రతీ శుక్రవారం ఇండస్ట్రీలో జాతకాలు మారిపోతుంటాయి. నాకు సక్సెస్ లభిస్తుందా? ఫ్లాప్ మూటగట్టుకొంటానా భయం వెంటాడుతుంటుంది. ఆ క్రమంలో వారి మానసికంగా ఒత్తిడి పెరిగిపోయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు అని నందినిరాయ్ చెప్పారు.

    రెండేళ్లపాటు డిప్రెషన్‌లో

    రెండేళ్లపాటు డిప్రెషన్‌లో

    బిగ్‌బాస్‌లో చేరకముందు రెండు సంవత్సరాలు తీవ్రమైన డిప్రెషన్‌లో కూరుకుపోయాను. నాకు కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వెంటాడేవి. డిప్రెషన్‌ తగ్గించుకోవడానికి నేను స్నేహితులతో మాట్లాడాను. నా సమస్యలు చెప్పి పరిష్కారాలపై ఆలోచించాం. వైద్యులను సంప్రదించి కొంత మేరకు చికిత్స పొందాను. బిగ్‌బాస్‌లో చేరిన తర్వాత నేను ఆ డిప్రెషన్ నుంచి బయడపడ్డాను అని నందనీ రాయ్ చెప్పారు.

    ఒంటరిగా, ఫ్యామిలీకి దూరంగా

    ఒంటరిగా, ఫ్యామిలీకి దూరంగా

    డిప్రెషన్‌ గురికావడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఇలాంటి కారణాలని చెప్పలేం. సమస్యలు ఎదురైనప్పుడు ఒంటరిగా ఉండాలనుకొంటారు. నలుగురితో కలువడానికి ఇష్డపడరు. అలాగే ఫ్యామిలీకి దూరమవుతాడు. ఇలాంటి లక్షణాలు డిప్రెషన్‌కు తొలి అడుగు అని నందినీ రాయ్ అభిప్రాయపడ్డారు.

    దీపికా పదుకోన్‌ను ఆదర్శంగా

    దీపికా పదుకోన్‌ను ఆదర్శంగా

    డిప్రెషన్‌ నుంచి బయటపడాలంటే ఒంటరితనం వీడాలి. నలుగురితో కలిసి తమ బాధను పంచుకోవాలి. ఈ విషయంలో అందరం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. తాను ఎలా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాననే విషయాన్ని ఆమె చక్కగా చెప్పారు. మానసిక ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరు దృష్టిపెట్టాలి అని నందనీ రాయ్ చెప్పారు.

    Recommended Video

    Samantha Fans Demand Apologize From Pooja Hegde
    యోగా, ఫ్యామిలీకి దగ్గరగా..

    యోగా, ఫ్యామిలీకి దగ్గరగా..

    డిప్రెషన్ నుంచి బయటపడటానికి సైక్రియాటిస్టులను కలవండి. స్నేహితులతో మనస్పూర్తిగా మాట్లాడాలి. లేదా యోగా, ఇతర వ్యాయామం చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్‌ను కలిసి నేను మా అమ్మతో మాట్లాడి నా సమస్యలు చెప్పుకొంటే వారిచ్చిన సలహాలు, ప్రేమతో ఉపశమనం లభించింది అని నందినీ రాయ్ చెప్పింది.

    English summary
    After Sushant Singh Rajput suicide, lot of people discussing about depression. Now, Tollywood heroine Nandini Rai reveals about her depression and suicidal thoughts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X