For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pranitha Subhash పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీతా సుభాష్.. క్యూట్ బేబీ ఫోటో వైరల్.. అలా పరిచయం చేస్తూ..

  |

  కన్నడ భాషలో పోకిరి చిత్రం రీమేక్ ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత తెలుగులోకి ప్రవేశించారు. బావ, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించారు. హిందీలో ప్రవేశించి అజయ్ దేవగన్‌తో కలిసి భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఛాన్ కిత్తన్ సినిమాలో నటిస్తున్నది. అయితే తాజాగా ప్రణీత సుభాష్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ వార్తను సోషల్ మీడియాలో వెల్లడిస్తూ తన అభిమానులతో ఆనందాన్ని పంచుకొన్నారు. ప్రణీత సుభాష్ వ్యక్తిగత జీవితం.. అలాగే తల్లిగా తన అనుభూతిని వెల్లడిస్తూ చేసిన పోస్టు గురించిన వివరాల్లోకి వెళ్లితే..

   2021లో నితిన్ రాజుతో పెళ్లి

  2021లో నితిన్ రాజుతో పెళ్లి

  కన్నడ సినీ పరిశ్రమలో కెరీర్ ఆరంభించిన ప్రణిత సుభాష్ అతికొద్ది రోజుల్లోనే బాలీవుడ్ స్థాయికి ఎదిగింది. కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉండగానే అభిమానులకు షాకిచ్చి పెళ్లి చేసుకొని దాంపత్య జీవితంలో సెటిల్ అయిపోయింది. 2021లో నితిన్ రాజు అనే వ్యాపారవేత్తతో వివాహం జరిగిన విషయం తెలిసిందే.

   ఇటీవల సీమంతం..

  ఇటీవల సీమంతం..


  ఇదిలా ఉండగా, ఇటీవల తాను తల్లి కాబోతున్నానని అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభవార్తను అందించింది. తాజాగా జరిగిన శ్రీమంతం ఫోటోలు సీమంతం సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. పండంటి బిడ్డకు జన్మనివ్వబోయే క్షణాలను షేర్ చేసుకొన్నది.

   సీమంతం ఫోటోలు వైరల్

  సీమంతం ఫోటోలు వైరల్


  ప్రణిత సుభాష్‌కు కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులు సీమంతం జరిపించారు. బంతిపూలతో అందంగా ముస్తాబు చేసిన వేదికపై పసుపు, గులాబి రంగు అంచు ఉన్న చీరలో ప్రణీత అందంగా కనిపించారు. సంప్రదాయంగా కుటుంబ సభ్యులు ఈ వేడుకను ఆడంబరంగా జరిపించారు. ఆ ఫోటోలను షేర్ చేయగా అభిమానులు శుభాకాంక్షలు అందించారు.

   ఆడ పిల్లకు జన్మనిచ్చినట్టు

  ఆడ పిల్లకు జన్మనిచ్చినట్టు


  ఇక జూన్ 10వ తేదీన తాను పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చనినట్టు తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా అద్భుతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఆడబిడ్డకు ఎప్పుడు జన్మనిచ్చారనే విషయాన్ని చెప్పకోవడంతో కొంత కన్‌ఫ్యూజన్ ఏర్పడింది.

  నా బిడ్డను పరిచయం చేస్తున్నానంటూ ఎమోషనల్

  నా బిడ్డను పరిచయం చేస్తున్నానంటూ ఎమోషనల్


  ప్రణీత సుభాష్ తన ఇన్స్‌టాగ్రామ్‌ అకౌంట్‌లో భావోద్వేగమైన పోస్టును పెట్టింది. మాకు ఆడపిల్ల జన్మించింది. మా ఇంటిలోకి చిన్నారి రాకతో కొద్ది రోజులుగా మా ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నాం. గైనకాలజిస్ట్ డాక్టర్ జయశ్రీ మాకు ఇచ్చి సహకారం మరువలేనిది. భావోద్వేగమైన సమయాల్లో ఇచ్చిన మానసిక స్థైర్యం మాటల్లో చెప్పలేను. డాక్టర్ సునీల్ ఇశ్వార్ బృందం ఉండటంతో నా డెలీవరీ చాలా స్మూత్‌గా జరిగిపోయింది. అనెస్తీషియన్ టీమ్ వల్ల నొప్పి లేకుండా నాకు ప్రసవం జరిగిపోయింది. అప్పటి నుంచి నా బిడ్డను మీకు పరిచయం చేయాలని ఎమోషనల్ అవుతున్నాను అని ప్రణీత సుభాష్ తన పోస్టులో తెలిపారు.

  ప్రకాశ్ రాజ్ భార్య మెసేజ్ వైరల్


  తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చానని పోస్టు పెట్టగానే ప్రణీత సుభాష్‌కు సోషల్ మీడియాలు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రకాశ్ రాజ్ సతీమణి పోని ప్రకాశ్ రాజ్ ముందుగా శుభాకాంక్షలు తెలిపి.. తల్లిబిడ్డలు బాగుండాలని కోరుకొన్నారు. అలాగే.. అభిమానులు, నెటిజన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ.. ఆనందంలో మంచెత్తారు.

  English summary
  The last few days have been surreal … ever since our baby girl was born.. ❤️🧿I was really lucky to have a gynaecologist mom, (Dr Jayashri) but for her this was the hardest time emotionally. Thankfully we had Dr Sunil Ishwar and his team at Aster Rv that made sure my delivery was smooth. Also wanted to thank Dr Subbu, our anaesthetist and his team who made sure the process was as less painful as possible. Can’t wait to share my birth story with you al
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X