Don't Miss!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
హీరోయిన్ రంభ శ్రీమంతం వేడుక; డాన్స్ చేస్తూ అదరగొట్టింది! (ఫోటోస్)
Recommended Video

ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో అందం, పెర్ఫార్మెన్స్‌తో యువతను ఉర్రూతలూగించిన రంభ తర్వాత ఇంద్రకుమార్ అనే బిజినెస్‌మెన్‌ను పెళ్లాడి కెనడలోని టోరంటోలో సెటిలైన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు లాన్య(7), సాషా(3) అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. త్వరలో రంభ-ఇంద్రకుమార్ దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. గర్భవతిగా ఉన్న రంభ శ్రీమంతం వేడుక ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు రంభ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

వైభవంగా రంభ శ్రీమంతం వేడుక
ఇటీవల టోరంటోలో రంభ శ్రీమంతం వేడుక వైభవంగా సాగింది. ఆమె భర్త, ఇద్దరు కుమార్తెలు, ఇతర బంధుమిత్రులు ఈ వేడుకలో పాల్గొన్నట్లు తాజా విడుదలైన ఫోటోలను బట్టి తెలుస్తోంది.

ఉత్సాహంగా డాన్స్ చేసిన రంభ
ఎంతో సందడిగా సాగిన ఈ వేడుకలో గర్భవతిగా ఉన్న రంభ డాన్స్ కూడా చేసినట్లు స్పష్టమవుతోంది. రంభ మొహంలో ఎన్నడూ లేనంత హ్యాపీనెస్ కనిపించడం ఆమె అభిమానుల్లో ఆనందం నింపింది.

ఇద్దరు కూతుళ్లు భర్తతో కలిసి...
శ్రీమంతం వేడుకలో భర్త ఇంద్రకుమార్, కూతుళ్లు లాన్య(7), సాషా(3)తో కలిసి సూపర్ హ్యాపీ మూడ్లో రంభ.

ప్రేమానుబంధాలు
అప్పట్లో రంభ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మనసు మార్చుకున్న ఈ జంట మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఫోటోల్లో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ జంటను చూస్తుంటే ఇకపై అలాంటి ఆలోచనలు వారి దరిదాపుల్లోకి కూడా రావని తెలుస్తోంది.

రంభ
‘ఆ ఒక్కటి అడక్కు' సినిమా ద్వారా హీరోయినగా కెరీర్ ప్రారంభించిన రంభ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో మెగాస్టార్ సహా అందరు స్టార్ హీరోలతో నటించింది. హిందీలో సల్మాన్ జుడ్వా, బంధన్ లాంటి చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. 2010లో ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.