Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Sai Pallavi: స్టార్ హీరోయిన్స్ పబ్ లలో ఎంజాయ్ చేస్తుంటే.. సాయి పల్లవి మాత్రం ఇలా.. షాకింగ్!
చూడగానే అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఆకర్షించే సాయి పల్లవి ఏ భాషలో నటించిన కూడా ఆ భాషకు తగ్గట్టుగా ఒక ట్రెడిషనల్ లుక్ లోకి మారిపోతూ ఉంటుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆమె చాలా దగ్గరయిపోయింది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగులో ఎంతో చక్కగా మాట్లాడుతూ ఎంతోమంది ప్రేక్షకుల మనసును దోచేసుకుంది. అయితే న్యూ ఇయర్ అనగానే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా పబ్ లలో అలాగే వివిధ పార్టీలలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ సాయి పల్లవి మాత్రం అందుకు భిన్నంగా వేరే ప్రపంచంలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

టాలెంటెడ్ నటిగా
మలయాళం చిత్ర పరిశ్రమకు చెందిన సాయి పల్లవి కెరీర్ మొదట్లోనే ఎంతగానో గుర్తింపును అందుకుంది. తన నటనతో అలాగే మాటలతో అమ్మడు ఆడియన్స్ ను ఎంతగానో కట్టిపడేస్తూ ఉంటుంది. మొదట ఆమె నటించిన మలయాళం సినిమా ద్వారానే ఇతర ఇండస్ట్రీలలో కూడా టాలెంటెడ్ నటిగా మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన విషయం తెలిసిందే.

గ్లామర్ డోస్ లేకుండా..
అతి తక్కువ కాలంలోనే పెద్దగా గ్లామర్ ప్రజెంటేషన్ క్రేజ్ అందుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లలో సాయి పల్లవి ఒకరు అని చెప్పవచ్చు. ఈ రోజులలో గ్లామర్ షో లేకపోతే అవకాశాలు రావు అనేవారికి ఆమె ఊహించిన విధంగా ఒక కౌంటర్ ఇచ్చింది అనే చెప్పాలి. మనకు తగ్గట్టు పాత్రను సెలెక్ట్ చేసుకుంటూ మంచి టాలెంట్ ను బయట పెడితే మంచి అవకాశాలు వస్తాయి అని ఈ బ్యూటీ చెప్పకనే చెబుతోంది.

అలాంటి సీన్స్ లేకుండా..
అనవసరమైన సన్నివేశాలలో సాయి పల్లవి గ్లామర్ డోస్ పెంచకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అవసరమైతే తప్ప ఆమె ఫ్యాషన్ దుస్తుల్లో పెద్దగా కనిపించదు. ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ లోనే సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడుతుంది. అంతేకాకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా సాయి పల్లవి లిమిట్స్ దాటిన సందర్భాలు లేవు. అలాంటి సన్నివేశాలు అంటే తనకు ఇష్టం ఉండవు అని రేపు నా పిల్లలు నా తల్లిదండ్రులు సినిమా చూసేలా ఉండాలి అని సాయి పల్లవి పలు ఇంటర్వ్యూలలో తెలియజేసింది.

అందుకు విరుద్ధంగా..
అయితే సాయి పల్లవి న్యూ ఇయర్ లో మాత్రం ఊహించని విధంగా కనిపించింది. సాధారణంగా సినిమా ప్రపంచంలో ఉండే అందరూ సెలబ్రిటీలు కూడా వివిధ రకాల పార్టీలలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ అయితే పబ్ లలో అలాగే ఇతర నటీనటులతో కూడా వెస్ట్రన్ కల్చర్ కు తగ్గట్టుగా పార్టీలలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ సాయి పల్లవి మాత్రం అందుకు విరుద్ధంగానే నడుచుకుంటూ ఉంటుంది.

పుట్టపర్తిలో సాయి పల్లవి
ఇక న్యూ ఇయర్ రోజు సాయి పల్లవి ప్రత్యేకంగా పుట్టపర్తి లోని సాయిబాబా టెంపుల్ లో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె దైవ ధ్యానంలో మునిగితేలుతున్నట్లు కనిపించింది. పద్దతిగా పట్టు చీరలలో సంప్రదాయానికి తగ్గట్టుగా ఒక తెలుగు అమ్మాయి తరహాలోనే ఆమె కనిపించిన విధానం ఓవర్గం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. పెద్దగా హడావిడి లేకుండా ఆమె కూల్ గా అక్కడ సాధారణ ప్రజలతో కలిసి ఆ విధంగా కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.