వాళ్ల టార్గెట్ నేనే.. ఆ హీరోల పేర్లు చెబితే ... కల్కి 2, స్పిరిట్ వివాదంపై దీపికా పదుకొనె రియాక్షన్

ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులకు లేబర్ చట్టాల ప్రకారం కొన్ని హక్కులు ఉంటాయి. వీటిలో ప్రధానమైనది 8 గంటల వర్క్ కల్చర్, వారానికి ఒకరోజు సెలవు దినం. వీటిని అన్ని సెక్టార్‌లలోనూ విధిగా పాటిస్తారు. అయితే సినీ పరిశ్రమలో ఈ విధానంపై మాట్లాడిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రెండు కీలకమైన ప్రాజెక్ట్స్ నుంచి ఆమెను తప్పించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ వివాదంపై దీపిక పదుకొనె మౌనం వీడారు. ఇండస్ట్రీలో పని పరిస్ధితులపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి 2898 ఏడీ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీపిక పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరుల నటనకు తోడు వీఎఫ్ఎక్స్ హంగులతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా కల్కి 2ని తెరకెక్కించాలని వైజయంతీ మూవీస్ నిర్ణయించింది. పార్ట్ 1లో ఉన్న క్యాస్టింగే పార్ట్ 2లోనూ కంటిన్యూ అవుతారని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Deepika Padukone reaction on 8 hours shift controversy

కల్కి 2 నుంచి దీపిక ఔట్
అయితే అనూహ్యంగా కల్కి 2 నుంచి దీపిక పదుకొనెను తప్పిస్తూ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించడం కలకలం రేపింది. కల్కిలో సుమతిగా, కల్కికి జన్మనివ్వబోయే మహిళగా అద్భుతంగా నటించారు దీపిక . అలాంటిది కల్కి 2లో దీపిక ఉండరని తెలిసి ఆమె అభిమానులు షాక్ అయ్యారు. కల్కి 2898 ఏడీ నుంచి నేటి వరకు సుదీర్ఘ ప్రయాణం కొనసాగించినప్పటికీ మా మధ్య సరైన భాగస్వామ్యం కుదరలేదని అశ్వినీదత్ సంస్థ ట్వీట్ చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఇమేజ్ కలిగిన కల్కి 2 వంటి చిత్రానికి నిబద్ధత అవసరమని స్పష్టం చేసింది.

దీపిక డిమాండ్లతో నిర్మాతల్లో కంగారు
అయితే ఇప్పటికే ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ నుంచి కూడా దీపిక తప్పుకున్నారు. తాజాగా కల్కి 2 నుంచి కూడా ఈ ముద్దుగుమ్మను తప్పించడం వెనుక కారణాలేంటీ? అనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా భారీ రెమ్యునరేషన్, తన టీమ్ మొత్తానికి వానిటీ వ్యాన్లు, లగ్జరీ హోటల్స్‌లో సౌకర్యాలు కల్పించాలని దీపిక డిమాండ్ చేశారని చెబుతున్నారు. అయితే ఇలాంటి వాటికి నిర్మాతలు భయపడరు.. కానీ ప్రధానంగా ఆమె కోరే 8 గంటల వర్క్ అనేది దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తోంది. అయితే భారీ బడ్జెట్ సినిమాలకు ఇలాంటి నిబంధనలు వర్తించవని.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో? ఎప్పుడు ముగుస్తుందో? ఎవరికీ తెలియదని విశ్లేషకులు అంటున్నారు.

నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు
స్వతహాగా ఒక మహిళ కావడం వల్ల... అది ఒత్తిడిగా అనిపిస్తుంది. కానీ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది సూపర్ స్టార్లు, హీరోలుగా ఏళ్లుగా 8 గంటలు పనిచేస్తున్నారనేది రహస్యం కాదు. ఇది ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు. వారి పేర్లు బయటపెట్టి దీనిని హాట్ టాపిక్‌గా మార్చాలని నేను అనుకోను. చాలా మంది హీరోలు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేస్తూ వీకెండ్‌లో సెలవు తీసుకుంటారు. భారతీయ చిత్ర పరిశ్రమను ఒక పరిశ్రమగా పిలిచినప్పటికీ.. ఒక పరిశ్రమలా ఇది పనిచేయలేదు, ఇక్కడంతా అస్తవ్యస్తమే. ఈ కల్చర్‌ను మార్చి కొత్త వ్యవస్థను తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన పలువురు హీరోయిన్లు కూడా 8 గంటలే వర్క్ చేస్తున్నారని.. కానీ తననే టార్గెట్ చేస్తున్నారని దీపిక ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. మరి దీనిపై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: deepika padukone kalki spirit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X