కల్కి నుంచి అవుట్.. ఫస్ట్ టైమ్ దీపిక పదుకోన్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యకాలంలో నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సీక్వెల్‌ (Kalki Sequel), అలాగే.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న స్పిరిట్ (Spirit)సినిమాల నుండి వైదొలగడంతో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఐఎండీబీ (IMDb)ప్రకటించిన 25 ఏళ్ల భారతీయ సినిమాల ప్రత్యేక నివేదికలో టాప్ లో నిలవడంపై కూడా స్పందించింది. ఈ సమయంలో వివాదాలపై స్పందించింది. ఇంతకీ ఏమన్నారంటే?

IMDb రిపోర్ట్‌లో దీపిక టాప్
ఐఎండీబీ (IMDb)తాజాగా విడుదల చేసిన 25 ఏళ్ల భారతీయ సినిమాల నివేదిక (Years of Indian Cinema 2000-2025)లో ప్రతి ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన 5 సినిమాలను లిస్ట్ చేసింది. మొత్తం 130 చిత్రాల్లో దీపిక పదుకొణె నటించిన 10 సినిమాలు చోటు దక్కించుకోవడం విశేషం. ఇందులో షారుక్ ఖాన్ 20 సినిమాలతో టాప్‌లో నిలవగా, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్‌ 11 సినిమాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్, ఆలియా భట్‌లకంటే దీపిక ముందంజలో నిలిచింది.

Deepika Padukone Responds to IMDb Report Exits Kalki amp amp Spirit Projects

ఈ నివేదికపై దీపిక స్పందించింది. "నా కెరీర్‌ ఆరంభం నుంచే నాకు ఎన్నో సూచనలు వచ్చాయి. ఒక మహిళగా ఎలా నడుచుకోవాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అని చెప్పేవారు. కానీ నేను ఎప్పుడూ భయపడలేదు. ప్రశ్నించడానికి వెనకాడలేదు. కాస్త కఠినమైన దారినైనా ఎంచుకుని, అందరూ అలవాటు అయిన 'మోల్డ్'ని చెరిపేయడానికి, కొత్త మార్గాన్ని సృష్టించడానికి ప్రయత్నించాను. అదే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది. నా కుటుంబం, అభిమానులు, సహచరులు నాపై ఉంచిన విశ్వాసమే నన్ను ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా చేసింది. వారి నమ్మకమే నా బలంగా మారింది. IMDb రిపోర్ట్‌ నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నిజాయితీ, పట్టుదలతో ముందుకు సాగితే మార్పు సాధ్యమే" అని దీపిక స్పష్టంచేశారు.

కల్కి, స్పిరిట్‌ ఎగ్జిట్‌పై హాట్ టాపిక్
ఇక ఇటీవల దీపిక కల్కి 2898 AD పార్ట్ 2 నుంచి వైదొలగడం, అలాగే స్పీరిట్ (Spirit)సినిమా నుండి తప్పుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయంగా మారింది. కల్కి సినిమా కోసం 'హై లెవల్ కమిట్‌మెంట్'అవసరమని, అలాగే స్పిరిట్ విషయంలో 8 గంటల వర్క్‌డే కోరడంతో విబేధాలు వచ్చినట్లు సమాచారం. ఈ వివాదాల మధ్యలో కూడా దీపిక భారీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. షారుక్ ఖాన్ హీరోగా రాబోయే కింగ్ చిత్రంలో నటించనున్నట్లు ధృవీకరించారు. అలాగే ఐఎండీబీ( IMDb) గత దశాబ్దంలో మోస్ట్ వ్యూస్ పొందిన ఇండియన్ యాక్టర్స్ జాబితాలో కూడా ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తానికి, సవాళ్లను స్వీకరించడమే తన ప్రయాణమని దీపిక మరోసారి నిరూపించుకుంది.

More from Filmibeat

Read more about: deepika padukone kalki spirit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X