రొమాన్స్, ఎక్స్‌పోజింగ్ చేస్తేనే సక్సెస్.. అలా ఉంటేనే ఆఫర్స్..
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడటం అంత సులభమైన విషయం కాదు. గ్లామర్‌కి, రొమాన్స్‌కి ప్రాధాన్యం ఇచ్చే ఈ ఇండస్ట్రీలో కొన్నిసార్లు నటులు తమ కంఫర్ట్‌జోన్ దాటి నటించాల్సి వస్తుంది. సన్నివేశం డిమాండ్ చేస్తే రొమాంటిక్ సీన్లు, ఎక్స్‌పోజింగ్ కూడా చేయాల్సిన అవసరం వస్తుందని చాలామంది సినీ తారలు స్పష్టంగా చెబుతుంటారు. ఈ విషయంపై పలువురు నటీమణులు ఇప్పటికే బహిరంగంగా మాట్లాడారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ "రొమాన్స్, ఎక్స్‌పోజింగ్‌కి నో చెప్పా.. సక్సెస్ అందుకోలేకపోయా!" అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ నటి ఎవరు?
ఆ నటి ఎవరో కాదు.. ధన్యా బాలకృష్ణ (Dhanya Balakrishna). టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్లలో ఒకరైన ధన్యా బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించినా, తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న ధన్యా, తొలుత ఈ అమ్మడు తమిళ ఇండస్ట్రీలో చిన్న పాత్రలతో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగు సినిమాలకు అడుగుపెట్టి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజుగారి గది 2, లవర్స్, బాపు వంటి సినిమాల్లో నటించారు. చిన్న పాత్రలైనా, తన నేచురల్ యాక్టింగ్, సింపుల్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తర్వాత కొన్ని వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు కూడా చేశారు.

ఇదిలా ఉంటే.. ధన్య బాలకృష్ణ త్వరలోనే కృష్ణ లీల (Krishna Leela)అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దేవన్(Devan) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దేవన్ హీరో నటించగా.. ధన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా 'కృష్ణ లీల' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో నటి ధన్యా బాలకృష్ణ పాల్గొని, తన మనసులో మాటలు పంచుకున్నారు. ఈ ఈవెంట్‌లో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రిపోర్టర్ ప్రశ్నిస్తూ "మీకు ఇండస్ట్రీలో ఇంకా మంచి సక్సెస్ రావాలి అని అనిపించదా? మీ సమకాలీన నటీమణులతో పోల్చుకుంటే మీరు ఇంకా వెనుకబడి ఉన్నారని అనిపించదా?" అని ప్రశ్నించగా.. ధన్యా చాలా నిజాయితీగా స్పందిస్తూ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలను చెప్పింది. "నా కెరీర్ ప్రారంభంలో నేను నన్ను ఇతరులతో పోల్చుకునేదాన్ని. వాళ్లు ఎందుకు సక్సెస్ అవుతున్నారు, నేను ఎందుకు కాలేకపోతున్నాను అని ఆలోచించేదాన్ని. అప్పుడప్పుడూ డీప్రెషన్‌లోకి వెళ్లిపోయేంత ఒత్తిడి వచ్చేది. కానీ తరువాత తెలిసింది ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. మనం ఎవరినీ కాపీ చేయలేం, ప్రతి ఒక్కరి టైమ్, టాలెంట్, లక్ వేరు. నా చుట్టూ ఉన్న వాళ్లు ఎగురుతుంటే నేను నడవడమే సరిపోతుంది, కానీ నా దారిలో నడుస్తున్నాను అనే సంతృప్తి ఉండాలి" అని చెప్పారు.
అంతేకాదు, ఆమె తన కెరీర్‌లో ఎందుకు సక్సెస్ అందుకోలేకపోయారో కూడా వివరించారు. "నేను ఇండస్ట్రీలోకి వచ్చే ముందు నుంచే కొన్ని పరిమితులు పెట్టుకున్నాను. కొన్ని గ్లామరస్ పాత్రలు, ఎక్స్ట్రీమ్ రొమాంటిక్ సీన్లు నాకు ఆఫర్ అయ్యాయి. కానీ నేను వాటిని రిజెక్ట్ చేశాను. నాకు నా సాంప్రదాయ విలువలు చాలా ముఖ్యమని భావించాను. అందుకే కొన్నింటిని అంగీకరించలేదు. ఈ కారణంగా చాలా మంచి సినిమా ఆఫర్ దూరమయ్యాయి. అయినా కూడా పశ్చాత్తాపం లేదు" అని ధన్యా తెలిపింది.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా ధన్యా పంచుకున్నారు. "నేను ఓ మధ్యతరగతి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాను. సినిమాలు చేయడం నా తల్లిదండ్రులకు మొదట నచ్చలేదు. కానీ నేను వారిని ఒప్పించి, ఫైట్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చాను. మొదట చిన్న చిన్న పాత్రలు చేశాను. చాలా కష్టపడి, నెమ్మదిగా నా స్థానం సంపాదించుకున్నాను. ఇప్పుడు 'కృష్ణ లీల' సినిమాలో హీరోయిన్‌గా పరిచయం అవ్వడం నాకు ఎంతో గర్వకారణం, ఇదే నా సక్సెస్ " అని భావోద్వేగంతో చెప్పారు..
ఇక 'కృష్ణ లీల' సినిమా ఒక రొమాంటిక్ రీబర్త్ డ్రామా. గత జన్మలో ఓడిపోయిన ప్రేమను ప్రస్తుత జన్మలో తిరిగి సాధించాలనుకునే ప్రేమికుడి కథగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో ప్రేమ, కర్మ, పునర్జన్మ అనే అంశాలను మిళితం చేస్తూ కథనం సాగనుంది. ట్రైలర్‌లో చూపిన ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ మ్యూజిక్, విజువల్ ప్రెజెంటేషన్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయి. ధన్యా బాలకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించగా, ఆమె లుక్, ఎమోషనల్ యాక్టింగ్ ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











