Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
వర్కవుట్లతో కుస్తీ.. ఈషారెబ్బా వీడియో వైరల్
తెలుగు తెరపై తెలుగు అందాలు అంతగా కనిపించవు. టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిలను, వారి ప్రతిభను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈషారెబ్బా, చాందినీ చౌదరీ, నందినీ రాయ్, ప్రియాంక జవాల్కర్ వంటివారికి చాన్సులు వస్తున్నాయి. అందరూ కూడా పలు ఆఫర్లతో మంచి స్పీడు మీదున్నారు. అందరికంటే ఎక్కువగా ఈషా రెబ్బా ముందంజలో ఉంది.
అందం, ప్రతిభ ఇలా అన్నీ కలిసిన ప్రతిరూపంగా ఈషారెబ్బాను అందరూ ఆరాధిస్తుంటారు. సోషల్ మీడియాలో ఈషారెబ్బాకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఈషా రెబ్బా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. అంతే కాకుండా అచ్చమైన పదహరణాల తెలుగమ్మాయిలా చీరకట్టుతో అందరినీ కట్టిపడేస్తూ ఉంటుంది. తాజాగా ఈషా రెబ్బా తన వర్కవుట్లకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

ఈషా రెబ్బా ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌కు రీమేక్‌గా వస్తోన్న పిట్ట కథలు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ మధ్యే విడుదల చేసిన టీజర్‌లో ఈషా రెబ్బా అదరగొట్టేసింది. అయితే ఈషా ప్రస్తుతం తన ఫిట్ నెస్‌పై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. నీ కోసం నువ్వే నిలబడాలి.. ఎవ్వరూ రారు అంటూఈషా రెబ్బా జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.