Don't Miss!
- News
నందమూరి తారకరత్నకు నేడు మరోమారు కీలక వైద్యపరీక్షలు.. తర్వాతే స్పష్టత; అందరిలో టెన్షన్!!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
- Automobiles
ఆల్టో కె10 ఎక్స్ట్రా ఎడిషన్ విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి.. వివరాలు
- Finance
Pakistan Crisis: ఓడరేవుల్లో సరుకులు.. పాకిస్థానీలకు మాత్రం ఆకలి కేకలు.. ఎందుకిలా..?
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Kriti Shetty అందాలతో ఆకట్టుకొంటున్న ఉప్పెన భామ, ఫ్యాషన్ వెనుక సీక్రెట్ ఎవరంటే?
అందాల భామ కృతిశెట్టి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన వేళా విశేషంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఆమె నటించిన ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ భారీ విజయాలను అందుకోవడంతో ఆమె పట్టిందల్లా బంగారం అవుతుందనే మాట ఇప్పుడు సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. తాజాగా జరిగిన శ్యామ్ సింగరాయ్ ప్రెస్ మీట్‌లో కృతిశెట్టిపై నాని, ఆర్ నారాయణ మూర్తి కురిపించిన పొగడ్తలు చర్చనీయాంశమయ్యాయి. కృతిశెట్టి ఫ్యాషన్ హంగామా వెనుక సీక్రెట్ ఏమిటంటే.

ఉప్పెన, శ్యామ్ సింగరాయ్‌తో
కృతిశెట్టి కెరీర్ విషయానికి వస్తే.. వైష్ణవ్ తేజ్‌తో కలిసి ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా భారీ సక్సెస్ కావడంతో భారీగా ఆఫర్లను చేజిక్కించుకొన్నది. తాజాగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో ఆమె పాత్ర యూత్‌తోపాటు అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ ట్రెండింగ్‌గా మారింది.

టాలీవుడ్ ఆశా పరేఖ్ అంటూ నారాయణమూర్తి
కృతిశెట్టిని చూస్తే పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. కేవలం అందమే కాదు.. అభినయంతో కూడా అందర్నీ ఆకట్టుకొంటున్నది. గతంలో భారతీయ సినిమా పరిశ్రమను ఏలిన అందాల తార ఆశా పరేఖ్ మాదిరిగా ఉంది. ఆశా పరేఖ్ మాదిరిగా దేశం గర్వించదగిన హీరోయిన్ కావాలి అని ఆర్ నారాయణ మూర్తి కితాబిచ్చారు.

ఫ్యాషన్ దుస్తులతో హంగామా
అయితే ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కృతిశెట్టి ధరించిన దుస్తులు అందర్ని ఆకట్టుకొన్నాయి. అయితే ఆమె ధరించిన డ్రెస్సెస్ అభిమానులను ఆకట్టుకొన్నాయి. ఆమె ధరించే ఫ్యాషన్ దుస్తుల వెనుక సీక్రెట్ ఆమె తల్లి కారణం. కృతిశెట్టి తల్లి ఫ్యాషన్ డిజైనర్ కావడంతో ఆమె అందం ఉట్టిపడేలా అందర్నీ ఆకర్షించే విధంగా డ్రస్సులు ధరిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది.

మోడరన్ గర్ల్‌గా
కృతిశెట్టి కేవలం పక్కింటి అమ్మాయిగానే కాకుండా మోడరన్ గర్ల్‌గా తనదైన శైలిలో ఆకట్టుకొంటున్నది. ఇటీవల ఆమె ధరించిన దుస్తులు మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్‌గా మారాయి. ఆమె లుక్, ఫోటోలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారుతున్నాయి. అభిమానులు ఆమె అందానికి ముగ్దులు అవుతున్నారు.

కృతిశెట్టి సినిమా కెరీర్ ఇలా..
ఇక కృతిశెట్టి సినిమాల విషయాలకు వస్తే.. ప్రస్తుతం అక్కినేని నాగార్జున, నాగచైతన్య నటిస్తున్న బంగార్రాజు చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో సుధీర్ బాబుతో కలిసి నటిస్తున్నారు. ఇకా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, యష్ చిత్రాల్లో కృతిశెట్టిని హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.