For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్: ఆమె ప్రెగ్నెంట్ అనడానికి ఇదే సాక్ష్యం.. అలా కనిపించడంతో!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, వారిలో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. అనతి కాలంలోనే అద్భుతమైన యాక్టింగ్, అదిరిపోయే అందంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీంతో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం ఆమె పెద్దగా సినిమాలు చేయకపోవడమే. ఇలాంటి సమయంలో కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఇదేనంటూ మరో ఆసక్తికరమైన అంశం కూడా బయటకు వచ్చింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  అలా మొదలు.. ఇలా ఎంట్రీ ఇచ్చింది

  అలా మొదలు.. ఇలా ఎంట్రీ ఇచ్చింది

  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో మోడల్‌ కెరీర్‌ను ఆరంభించింది కాజల్ అగర్వాల్. ఈ క్రమంలోనే ఆ రంగంలో తనదైన అందంతో సత్తా చాటుతోన్న సమయంలోనే నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ‘లక్ష్మీ కల్యాణం'తో ఈ బ్యూటీ హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో మెప్పించిన ఈ బ్యూటీ.. తెలుగులో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగం అయింది. దీంతో లక్కీ హీరోయిన్‌గా పేరొంది రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుని సత్తా చాటిందీ చందమామ.

  Bigg Boss: షోలో సంచలన సంఘటన.. సిరి టీషర్ట్‌లో చేయి పెట్టిన కంటెస్టెంట్.. అందరి ముందే బలవంతంగా!

  ఏ హీరోనూ వదిలి పెట్టని బ్యూటీ కాజల్

  ఏ హీరోనూ వదిలి పెట్టని బ్యూటీ కాజల్

  కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకోవడంతో కాజల్ అగర్వాల్ పేరు టాలీవుడ్‌లో మారుమ్రోగిపోయింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంది కాజల్ అగర్వాల్. ఏ సినిమా చేస్తే అది హిట్ అనేలా ఈ అమ్మడు కథలను ఎంచుకుంది. ఫలితంగా అప్పట్లో తన హవాను చూపించింది. ఇక, రోజులు గడిచిన కొద్దీ స్టార్లతోనే కాకుండా జూనియర్ హీరోల సినిమాల్లోనూ నటించింది. అలాగే, ‘ఖైదీ నెంబర్ 150'లో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవితోనూ చేసింది.

  అప్పుడలా.. ఇప్పుడిలా.. చాలా తక్కువే

  అప్పుడలా.. ఇప్పుడిలా.. చాలా తక్కువే

  ఏ ముహూర్తానా టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టిందో కానీ.. కాజల్ అగర్వాల్ చాలా కాలం పాటు స్టార్‌డమ్‌ను కొనసాగించింది. ఇలా దాదాపు ఐదారేళ్ల పాటు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లోనూ నటించింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె సినిమాల వేగం తగ్గించేసింది. అలా అని ఈ బ్యూటీకి అవకాశాలు రావట్లేదని కాదు.. చాన్స్‌లు వచ్చినా సెలెక్టివ్‌గానే సినిమాలను చేస్తోంది. ఫలితంగా తక్కువ చిత్రాల్లో నటిస్తూ వస్తుంది. ఆమె పెద్దగా సినిమాలు చేయకపోవడంతో ఎన్నో వార్తలు వస్తున్నాయి.

  Bigg Boss: సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ బండారం బట్టబయలు.. షోలో అడ్డంగా బుక్కైన ప్రేమికులు

   అతడితో ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని

  అతడితో ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని

  తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పుడే కాజల్ అగర్వాల్.. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు రహస్యంగా అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఈ క్రమంలోనే గత ఏడాది ఆరంభంలోనే తన ప్రేమను బహిర్గతం చేసుకుంది. ఆ తర్వాత 2020 అక్టోబర్ 30న కరోనా నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో గౌతమ్‌ను వివాహం చేసుకుంది. అయితే, చాలా మందిలా పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా.. తన కెరీర్‌ను కొనసాగిస్తూ తన స్టార్‌డమ్ తగ్గలేని నిరూపిస్తోందామె.

  వివాహం తర్వాత ఇలా... భారీ డిజాస్టర్

  వివాహం తర్వాత ఇలా... భారీ డిజాస్టర్

  వివాహం తర్వాత కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాలు చేయడం లేదు. ఈ ఏడాది ఆరంభంలో ఆమె తెలుగులో ‘మోసగాళ్లు' అనే సినిమా చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇందులో ఆమె మంచు విష్ణుకు సోదరిగా నటించింది. ఇక, ప్రస్తుతం కాజల్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య'లో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ప్రవీణ్ సత్తారు రూపొందిస్తోన్న చిత్రంలో అక్కినేని నాగార్జున సరసన నటిస్తోంది. ఈ రెండు సినిమాలు సీనియర్ హీరోలవే కావడంతో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయని ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది.

  ప్యాంట్‌ లేకుండా హీరోయిన్ ఘాటు ఫోజు: ప్రైవేట్ ఫొటో షేర్ చేసిన వర్మ.. మామూలోడు కాదుగా!

  తల్లి కాబోతున్న నటి కాజల్ అగర్వాల్

  తల్లి కాబోతున్న నటి కాజల్ అగర్వాల్

  గౌతమ్ కిచ్లుతో వివాహం జరిగిన తర్వాత కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందని కొద్ది నెలల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ వాటిని కొట్టివేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్‌లో ఓ నెటిజన్ ‘కాజల్, గౌతమ్ ఫ్యామిలీలో సంతోషకరమైన వార్త' అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని కూడా ఆ పోస్టులో జత చేశారు. దీంతో ఆమె నిజంగానే తల్లి కాబోతుందని రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

  Bigg Boss Telugu 5 : Uma బూతుల దెబ్బకు.. Week 2 Nominations || Oneindia Telugu
  సాక్ష్యం ఇదేనంటూ కామెంట్లు పెడుతూ

  సాక్ష్యం ఇదేనంటూ కామెంట్లు పెడుతూ

  ట్విట్టర్‌లో కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అన్న వార్త కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో చాలా మంది పలు రకాల అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు ‘కాజల్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులను ఒప్పుకోవడం లేదు. తల్లి కాబోతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది' అన్నట్లు కొత్త అనుమానాలు లేవనెత్తుతున్నారు. దీనికితోడు సోషల్ మీడియాలో ఈ వార్తపై ఎన్నో రకాల మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ వార్తలపై గతంలో మాదిరిగా కాజల్ ఫ్యామిలీ స్పందించకపోవడంతో ఈ వార్త నిజమేనని అనుకుంటున్నారు.

  English summary
  Tollywood Star Heroine Kajal Aggarwal Now Doing Very Few Movies. Because She Expecting Her First Child. This News Gone Hot Topic.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X