For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెహ్రీన్ ఫిర్జాదా బ్రేకప్‌కు కారణం ఇదే: దానికి ఒప్పుకోని భవ్య బిష్ణోయ్ కుటుంబం.. కొంప ముంచిన పంతం

  |

  సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు సర్వసాధారణంగా జరిగే విషయాలే. ఇష్టం వచ్చినంత కాలం లవ్ ట్రాకులు నడపడం.. ఆ తర్వాత కుదిరితే పెళ్లి లేదంటే విడిపోవడం ఈ రంగంలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పటికే ఎంతో మంది ఇలాంటి పనులతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పుడీ జాబితాలోకే వచ్చి చేరింది టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా. కొన్ని నెలల క్రితం భవ్య బిష్ణోయ్ అనే రాజకీయ నేపథ్యం ఉన్న కుర్రాడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఆమె.. తమ బంధం ముగిసిందని ప్రకటించింది. దీని వెనుక కారణం తాజాగా బయటకొచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  అలా మొదలైన కెరీర్.. బాగా ఫేమస్

  అలా మొదలైన కెరీర్.. బాగా ఫేమస్

  టాలెంటెడ్ హీరో నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' అనే సినిమాతో మెహ్రీన్ ఫిర్జాదా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే క్యూట్‌నెస్‌తో పాటు అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. టాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంటూ చాలా కాలంగా హవాను చూపిస్తోంది.

  యువనేతతో లవ్ ట్రాక్... నిశ్చితార్థం

  యువనేతతో లవ్ ట్రాక్... నిశ్చితార్థం

  తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది మెహ్రీన్. అదే సమయంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయ్ కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయ్‌తో లవ్ ట్రాక్ కూడా నడిపించింది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది.

  పెళ్లికి ఆలస్యం... కరోనా కారణం అని

  పెళ్లికి ఆలస్యం... కరోనా కారణం అని

  నిశ్చితార్థం జరిగిన తర్వాత తన ప్రియుడు భవ్య బిష్ణోయ్ గురించి మెహ్రీన్ ఎన్నో పోస్టులు పెట్టింది. అతడితో కలిసి ఉన్నవి.. అతడు ప్రపోజ్ చేసినవి ఇలా ఎన్నో రకాల విషయాలు వెల్లడించింది. దీంతో ఆమెకు పెళ్లి కళ వచ్చేసిందని ఫ్యాన్స్ మురిసిపోయారు. అది జరిగి చాలా కాలం అవుతోన్న ఆమె పెళ్లి మాత్రం చేసుకోలేదు. దీనికి కారణం కరోనా పరిస్థితులే అని అంతా అనుకున్నారు.

  ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అని చెప్పిన నటి

  ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అని చెప్పిన నటి


  ఇటీవలే హైదరాబాద్ చేరుకున్న మెహ్రీన్.. శనివారం నుంచే ‘ఎఫ్3' మూవీ షూటింగ్‌లో పాల్గొంటోంది. దీంతో ఆమె కెరీర్ కొనసాగుతుందని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో భవ్య బిష్ణోయ్‌తో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాదు, ఇకపై అతడితో, అతడి కుటుంబంతో తనకెలాంటి సంబంధం ఉండదని తేల్చేసిందామె.

  మెహ్రీన్ ఫిర్జాదా బ్రేకప్‌కు కారణం ఇదే

  మెహ్రీన్ ఫిర్జాదా బ్రేకప్‌కు కారణం ఇదే

  మెహ్రీన్ ఫిర్జాదా బ్రేకప్ తర్వాత దీని గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆమె ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోడానికి అసలు కారణం ఇదేనంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమవ్వాలని బిష్ణోయ్ ఫ్యామిలీ పెట్టిన కండీషన్ వల్లే వీళ్లు విడిపోయారట.

  F3 Movie Launched With Pooja Ceremony
  ఒప్పుకోని భవ్య బిష్ణోయ్ కుటుంబం

  ఒప్పుకోని భవ్య బిష్ణోయ్ కుటుంబం

  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మెహ్రీన్‌ ఎంగేజ్‌మెంట్ సమయంలో బిష్ణోయ్ ఫ్యామిలీ ఆమె కెరీర్ గురించి ఎలాంటి కండీషన్స్ పెట్టలేదట. కానీ, ఆ తర్వాత ఆమె సినిమాల్లో నటించొద్దని చెప్పారట. ఇది నచ్చని మెహ్రీన్ చాలా రోజులుగా వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేసిందట. కానీ, దీనికి వరుడు తరపు కుటుంబం పంతం పట్టి ఒప్పుకోకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందట.

  English summary
  Heroine Mehreen Pirzada and Bhavya Bishnoi have called off their engagement. She announced the news on her social media accounts. Now Interesting News Gone Viral on This.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X