twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం.. అసలు ఏమైందంటే?

    |

    సీనియర్ నటి జయప్రదకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాజాగా జయప్రద ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అసలు జయప్రద ఇంట్లో ఏం జరిగింది? జయప్రద ఎందుకు విషాదంలో కూరుకుపోయింది అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

    సినీ రంగ ప్రవేశం చేసి

    సినీ రంగ ప్రవేశం చేసి

    చాలా మంది నటీమణులు లానే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యింది జయప్రద. జయప్రద అసలు పేరు లలితా రాణి కాగా ఆమె 1962 ఏప్రిల్ 3న రాజమండ్రిలో జన్మించింది. చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సంగీతం, నృత్యంలో శిక్షణ తీసుకున్న ఆమె ఒకసారి పాఠశాల వార్షికోత్సవంలో నృత్య ప్రదర్శన ఇవ్వడంతో దానిని చూసి, ముగ్ధుడైన ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి తను నటించే భూమికోసం చిత్రంలో చిన్న వేషం ఇప్పించాడు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ 'జయప్రద ఫిలింస్' బ్యానర్ పేరు ఆమెకు పెట్టారు ఆ సినిమా దర్శకుడు తిలక్.

    జయప్రద గా మారి

    జయప్రద గా మారి

    అప్పటినుంచి లలితా రాణి కాస్త జయప్రద గా మారింది. అలా మొదలైన ఆమె సినీ కెరీర్ ఎనిమిది భాషల్లో 300 చిత్రాలకు పైగా కొనసాగుతూనే ఉంది. ఇక నటిగా తొలి రోజుల్లోనే కె.బాలచందర్, కె.విశ్వనాథ్ వంటి పెద్ద డైరెక్టర్ చిత్రాల్లో నటించే అవకాశం దక్కింది. అదే ఆ తరువాత రోజుల్లో జయప్రదకు అధ్బుత నటిగా పేరు సంపాదించి పెట్టింది. ఇక తెలుగులో దాదాపు అప్పటి అగ్ర హీరోలు అందరితో కలిసి నటించింది జయప్రద.

    ఎంపీగా

    ఎంపీగా

    ఇక సినీ రంగంలో కాకుండా ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయ రంగంలో అడుగు పెట్టి రాజ్యసభ సభ్యురాలిగా కూడా పని చేసింది జయప్రద. ఆ తరువాత ఉత్తర ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి రాంపూర్ లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయి అమర్ సింగ్ రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీలో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. గత ఎన్నికల ముందు బీజేపీలో జాయిన్ అయి రామ్‌పూర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ప్రస్తుతానికి ఆమె కాస్త సైలెంట్ గానే ఉన్నారు.

    తల్లి మృతి

    తల్లి మృతి

    అయితే నటి జయప్రద తల్లి నీలవేణి మంగళవారం నాడు సాయంత్రం అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆవిడ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. నీలవేణి వయసు ప్రస్తుతం 85 సంవత్సరాలు. ఆమెకు జయప్రదతో పాటు సౌందర్య రాజబాబు శ్రీరామ్ అనే సంతానం ఉన్నారు. తన తల్లి కన్నుమూయడంతో జయప్రద తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు జయప్రదకు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Jayaprada Mother neelaveni passed away
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X