కాజల్ అగర్వాల్ సూపర్ జోష్.. సముద్రపు అడుగున భర్తతో రొమాన్స్
దక్షిణాదిలో అగ్రతార కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30వ తేదీన సుదీర్ఘం కాలంగా ప్రేమలో ఉన్న ప్రియుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల వారిద్దరి హానిమూన్ ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్లి అక్కడ సందడి చేస్తున్నారు. తమ హానిమూన్ ట్రిప్‌లో దిగిన ఫోటోలు ఇన్సాటాగ్రామ్‌లో భారీగా వైరల్‌గా మారాయి. ఇక వారి హానిమూన్ ట్రిప్ ఎలా సాగుతున్నదంటే..

హానిమూన్ కోసం మాల్దీవులకు
కొద్ది రోజులుగా మాల్దీవుల్లో కాజల్ దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటీవల సముద్ర అడుగు భాగంలోకి డైవ్ చేసి జల విహారం చేయడం కనిపించింది. నల్లటి స్విమ్ సూట్ ధరించి కళ్లకు నల్లటి కళ్లద్దాలు పెట్టుకొని ప్రియుడితో నీటిలో షికారు చేసింది.

సముద్రంలో ఒంటరిగా ఉంటే..
తన సముద్ర అంతర్గ్బాగంలో ఈదుతూ ఉన్న ఫోటోను కాజల్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. సముద్రంలో ఒంటరిగా ఉంటే దాని మజా వేరేలా ఉంటుంది. మీకు తెలియిన ప్రకృతిలోని అందాలపై మీకు కలిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభిస్తాయి అంటూ పోస్టు పెట్టారు.

భర్త చేతిలో చేయి వేసి జలకాలు
కాజల్ సముద్ర విహారంలో మరో ఫోటోను షేర్ చేశారు. తన భర్తతో కలిసి నీటి అడుగుభాగంలో చేతులు పట్టుకొని జలకాలు ఆడటం కనిపించింది. సాహసవంతమైన సముద్ర విహారాన్ని ఎంజాయ్ చేస్తూ మరింత జోష్‌గా కనిపించింది.

నాకు నీలరంగు అంటే ఇష్టం..
నాకు సముద్రం అంటే ఎంతో ఇష్టం. నీలరంగు అంటే మహా ఇష్టం. ఆ రంగులో ఉండే ప్రశాంతత, శాంతం మరీ ఇష్టం. అంతే మొత్తంలో భయం కూడా ఉంటుంది అంటూ కాజల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

సముద్రం అడుగున గాజు గదిలో
ఇక సముద్ర అడుగు భాగంలో నిర్మించిన గాజు గదిలో కాజల్ దంపతులు బస చేశారు. పూర్తిగా సముద్ర అడుగు భాగంలో నిర్మించిన గదిలో భర్తతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దాంపత్య జీవితంలోని మధురత్వాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఈ ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recommended Video

కాజల్ అగర్వాల్ చేసే సినిమాలు
ఇదిలా ఉండగా, కాజల్ అగర్వాల్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆచార్య సినిమాతోపాటు మంచు విష్ణుతో మోసగాళ్లు అనే చిత్రంలో నటించింది. అలాగే కమల్ హాసన్‌తో ఇండియన్2 సినిమాలో నటిస్తున్నది. ఇండియన్ 2 షూటింగ్‌కు సంబంధించి ఆమె పాత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందనే సమాచారం. ఇంకా పలు ప్రాజెక్టుల చర్చల దశలో ఉన్నాయి. పెళ్లి తర్వాత సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించే ప్లాన్స్ చేసుకొన్నారు. ఇప్పటికే KA అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను రిజిస్టర్ చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











