Don't Miss!
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్‌దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
కాజల్ అగర్వాల్ డేరింగ్ స్టెప్: ఫ్యూచర్ కోసం తల్లి అయ్యేందుకు సిద్ధం.. అమ్మడి నిర్ణయానికి సినీ పెద్దలు షాక్
తెలుగు సినీ ఇండస్ట్రీలో సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది చందమామ కాజల్ అగర్వాల్. చూపు తిప్పుకోకుండా చేయగల అందమే కాదు.. మైమరపించే నటనతో దాదాపు పదేళ్లుగా తన హవాను చూపిస్తూ దూసుకుపోతోందామె. అంతేకాదు, వరుస సినిమా ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఇక, వివాహం తర్వాత కొంత స్పీడు తగ్గించిన కాజల్ అగర్వాల్.. ఫ్యూచర్ కోసం తల్లి అయ్యేందుకు సిద్ధం అయింది. ఈ అమ్మడు తీసుకున్న నిర్ణయానికి సినీ పెద్దలంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్ హవా
సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ హవాను చూపించింది కాజల్ అగర్వాల్. ఈ క్రమంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ ఆడిపాడింది. అదే సమయంలో ఎన్నో విజయాలను, అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోని పలు భాషల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే భారీ రెమ్యూనరేషన్‌ను అందుకుని సత్తా చాటింది.

బిజినెస్ మ్యాన్‌తో ప్రేమ... వివాహం
వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న సమయంలోనే కాజల్ అగర్వాల్ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు అతడితో రహస్యంగా లవ్ ట్రాక్ నడిపిన తర్వాత 2020 అక్టోబర్ 30న అతడిని వివాహం చేసుకుంది. అయితే, చాలా మందిలా పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తోంది. తద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

మ్యారేజ్ తర్వాత కాజల్ కెరీర్ ఇలా
వివాహం చేసుకున్న తర్వాత కాజల్ తెలుగులో 'మోసగాళ్లు' అనే సినిమా చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇందులో ఆమె మంచు విష్ణుకు సోదరిగా నటించింది. అలాగే, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'లో హీరోయిన్‌గా చేస్తోంది. దీనితో పాటు అక్కినేని నాగార్జున - ప్రవీణ్ సత్తారు మూవీలోనూ హీరోయిన్‌గా నటించేందుకు సంతకం పెట్టింది.

లేడీ మల్టీస్టారర్‌లో భాగమైన బ్యూటీ
పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్‌కు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అయితే, గతంలో మాదిరిగా ఇప్పుడు ఆమె యంగ్ అండ్ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ అందుకోవడం లేదు. సీనియర్ హీరోలతోనో, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనో నటిస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం లేడీ మల్టీస్టారర్‌గా వస్తోన్న 'కరుంగాపియం' అనే సినిమాలో ప్రధాన పాత్రను పోషిస్తోందామె.

కెరీర్ కోసం తల్లి అయ్యేందుకు సిద్ధం
'కరుంగాపియం' చిత్రాన్ని డీకే అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్‌తో పాటు రెజీనా కసాండ్రా, జననితో పాటు మరో కొత్త అమ్మాయి కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ చందమామ కాజల్ తల్లి పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఆమె పాత్ర మొత్త పిరియాడిక్ నేపథ్యంతో సాగుతుందనే టాక్ బాగా వినిపిస్తోంది.

కాజల్ నిర్ణయానికి సినీ పెద్దలు షాక్
'కరుంగాపియం' మూవీలో కాజల్ అగర్వాల్ తల్లిగా నటించడమే కాదు.. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండే దొరసానిలా కనిపించబోతుంది. గతంలో ఎన్నడూ చూడని మాదిరిగా ఇందులో ఆమె పాత్ర ఉంటుందని తెలుస్తోంది. కాజల్ చెప్పే డైలాగులు కూడా ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయని తెలుస్తోంది. ఇక, తల్లి పాత్రలో నటించాలన్న కాజల్ నిర్ణయానికి సినీ పెద్దలంతా షాక్‌కు గురవుతున్నారు.