For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rashmika Mandanna: మరింత ముదురుతున్న రష్మిక వివాదం.. సినిమాలపై బ్యాన్ విధించేలా చర్యలు?

  |

  కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఆ తర్వాత సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపును అందుకున్న రష్మిక మందన్న అతి తక్కువ కాలంలోనే మంచి అవకాశాలను సొంతం చేసుకుంది. అయితే ఈ బ్యూటీ ఇటీవల కావాలని కామెంట్ చేసిందో, లేక తొందరపాటులో మాట్లాడిందో తెలియదు కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆమె సినిమాలను బ్యాన్ చేసే వరకు పరిస్థితి ఎదురవుతున్నట్లు అర్థమవుతుంది. ఇంతకీ రష్మిక ఇలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కుంది అనే వివరాల్లోకి వెళితే..

  వరుస విజయాలు

  వరుస విజయాలు

  రష్మిక మందన మంచి నటిగా కన్నడ చిత్ర పరిశ్రమంలో అతి తక్కువ కాలంలోనే గుర్తింపు అందుకుంది. అయితే ఆమె మొదటి సినిమా కిరిక్ పార్టీ సక్సెస్ కాగానే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి అవకాశాలు వచ్చాయి. దీంతో తెలుగులో చలో, గీతాగోవిందం, భీష్మ వంటి సినిమాలు వరుసగా సక్సెస్ కావడంతో ఆమెకు మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం దొరికింది.

   బాలీవుడ్ లో కూడా ఆఫర్లు

  బాలీవుడ్ లో కూడా ఆఫర్లు

  ముఖ్యంగా పుష్ప సినిమాతో రష్మిక మందన్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు దక్కింది. పుష్ప సినిమా హిందీలో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రష్మిక మందన్న అమితాబచ్చన్ తో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

  కాంతారపై ఆ కామెంట్స్ వైరల్

  కాంతారపై ఆ కామెంట్స్ వైరల్

  అయితే ఇటీవల రష్మిక ఒక ఇంటర్వ్యూలో కాంతార సినిమా చూడలేదు అని సమయం పెద్దగా దొరకడం లేదు అని ఊహించిన విధంగా స్పందించడం ఆమెపై నెగిటివ్ కామెంట్స్ వచ్చేలా చేసింది. తర్వాత చూస్తాను అంటే అయిపోయేది కానీ ఆమె కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన సినిమా గురించి అంత తేలిగ్గా మాట్లాడడం కూడా వైరల్ గా మారిపోయింది. ఆ తర్వాత ట్రోలింగ్ ఎక్కువ కావడంతో రష్మిక మందన్న స్పందించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

  మొదటి ఛాన్స్ ఇస్తే..

  మొదటి ఛాన్స్ ఇస్తే..

  అంతేకాకుండా రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో సోకాల్డ్ ప్రొడక్షన్స్ తనకు మొదట అవకాశం అంత తేలిగ్గా ఇవ్వలేదు అని నేను మోడల్ గా ఉన్నప్పుడు ఒక మ్యాగజైన్ పై వచ్చిన ఫోటో చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పింది. మొదట ఆమెను సెలెక్ట్ చేసుకుంది మరెవరో. రిషబీ శెట్టి. అతను మొదటి దర్శకత్వం వహించిన కిరిక్ పార్టీలోనే రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఆ సినిమాలో రష్మిక మందన్న మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. అంతేకాకుండా కన్నడ చిత్రపరిషములో ప్రముఖ నిర్మాణ సంస్థలు అయినా పరమ్ వా, పుష్కర్ ఫిలిమ్స్ ఆ సినిమాను నిర్మించాయి.

   రక్షిత్ కౌంటర్

  రక్షిత్ కౌంటర్

  అయితే రష్మిక మందన్న మొదటి ప్రొడక్షన్ ను సో కాల్డ్ ప్రొడక్షన్ అని అనడంతో ఒక్కసారిగా ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే వెంటనే రిషబ్ శెట్టి కూడా ఆమె మాట్లాడిన విధానంపై పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చాడు. అలాంటి నటీనటులతో నటించడం తనకి ఇష్టం ఉండదు అని రష్మిక మందన్న చూపించిన హావభావాలను కూడా అతను ఆ ఇంటర్వ్యూలో ఇమిటేట్ చేశాడు.

  బ్యాన్ విధించేలా..

  బ్యాన్ విధించేలా..

  అయితే ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమంలోని నిర్మాతల మండలి రష్మిక మందన్న పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన సినిమాలను కన్నడలో రిలీజ్ చేయనివ్వకూడదు అనే విధంగా పూర్తిస్థాయిలో బ్యాన్ విధించాలి అని కన్నడ చిత్ర పరిశ్రమ నిర్మాతల సంఘం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కన్నడ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే. ప్రస్తుతం రష్మిక పుష్ప 2, వారసుడు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

  English summary
  Kannada Film Industry will soon going to take an action on Rashmika Mandanna
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X