twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత 'ఊ అంటావా' అంటే ఒకపక్క రచ్చ.. మరోపక్క పాలాభిషేకం.. మాములుగా లేదుగా!

    |

    హీరోయిన్ సమంత పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఊ అంటావా మావా..ఉహు ఉహు అంటావా మావ పాట మగాళ్లను కించపరిచేలా ఉందంటూ ఏపీలోని పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది. అయిది ఇప్పుడు అనూహ్యంగా ఈ పాటలో డ్యాన్స్ వేసినందుకు గాను సమంత ఫొటోకు పాలాభిషేకం చేసారు. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Pushpa Movie వివాదాలు.. Hype మాత్రం Thaggedhe Le | Allu Arjun || Oneindia Telugu
     తెగ ఆకట్టుకుంటుంది

    తెగ ఆకట్టుకుంటుంది

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న పుష్ప సినిమాలో సమంత ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ పాట ఓ యూట్యూబ్‏ని షేర్ చేస్తుంది. సింగర్ మంగ్లీ చెల్లెలు, ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ మత్తు వాయిస్‏తో పాడిన ఈ పాట జనాన్ని బాగా తెగ ఆకట్టుకుంటుంది.

    పురుషుల సంఘం

    పురుషుల సంఘం

    ఇంద్రావతి చౌహాన్ వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. సమంత స్టెప్పులు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట్లో ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్‏తో దూసుకుపోతుంది. అయితే మీ మగబుద్ధే వంకరబుద్ది.. అంటూ సాగే లిరిక్స్ మగావాళ్లను తప్పుగా చూపించేలా ఉన్నాయని.. ఈ పాటలోని లిరిక్స్ వలన పురుషుల పై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించింది. పుష్ప సినిమాతో పాటు పాట రాసిన చంద్రబోస్, పాటలో నర్తించిన సమంతపై కూడా పురుషుల సంఘం కేసు పెట్టింది. పాటపై నిషేదం విధించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది పురుషుల సంఘం.

    రంగంలో మహిళా మండలి

    రంగంలో మహిళా మండలి

    అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆ సాంగ్‌కు స‌పోర్ట్‌గా ఓ మహిళా మండలి రంగంలోకి దిగింది. తాజాగా అమరావతిలోని తాళ్లూరు గ్రామంలో కోదండరామ ఆలయంలో 'ఊ అంటావా... ఊఊ అంటావా' పాటలో డాన్స్ చేసిన సమంతకు, ఆ పాట రాసిన గేయ రచయిత చంద్రబోస్ కి స్థానిక మహిళా మండలి సభ్యులు అర్చన చేశారు. అలాగే, వారి ఫొటోలకు పాలతో అభిషేకం కూడా చేశారు.

    ఈలలు వేసి, చెప్పట్లు

    ఈలలు వేసి, చెప్పట్లు

    ఆ తరువాత అనంతరం పురుషులది దురహంకారం అని, ఈ పాట మీద కేసు వేయడం దుశ్చర్య అని మండిపడ్డారు. పురుషుల దురహంకారం, దుశ్చర్యలను ఎండగట్టే పాట మీద వివాదాన్ని రాజేసిన పురుష సంఘానిది వంకరబుద్ది అని వారు విమర్శించారు. మహిళల ఐకమత్యం వర్ధిల్లాలని నినాదాలు చేసి 'పుష్ప' సినిమాను తొలి రోజు చూస్తామని, 'ఊ అంటావా' పాటకు ఈలలు వేసి, చెప్పట్లు కొడతామని చెప్పారు.

    ఈనెల 17 న

    ఈనెల 17 న

    ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఈనెల 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మూవీ పై అంచనాలను భారీగా పెంచింది. ఇందులో స్మగ్లర్ కమ్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ లుక్ లో బన్నీ కనిపించనుండగా.. ఆయన ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహద్ పాజిల్ పోలీస్ ఆఫీసర్ కం విలన్ పాత్రలో నటిస్తుండగా.. సునీల్, జబర్దస్త్ అనసూయలు కూడా నెగిటివ్ పాత్రలలో నటిస్తున్నారు.

    English summary
    Palabhishekam For Samantha In Amaravati andhra pradesh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X