Don't Miss!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
ఆ హీరోయిన్లను ఫాలో అవుతోన్న రాశీ ఖన్నా: అందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్
'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆమె.. వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. నటనకు నటన, గ్లామర్‌కు గ్లామర్ ప్రదర్శిస్తూ సత్తా చాటుతోంది. ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఆమె.. 'వరల్డ్ ఫేమస్ లవ్' వంటి ఫ్లాప్ తర్వాత మరో సినిమాను ఓకే చేయలేదు. ఈ నేపథ్యంలో రాశీ ఖన్నా ఓ కీలక నిర్ణయం తీసుకుందని టాక్.
కొంత కాలంగా ఇండియాలో ఓటీటీ సంస్థల హవా కనిపిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వాటి ప్రభావం ఎక్కువైంది. దీంతో ప్రముఖ సంస్థలన్నీ వెబ్ సిరీస్‌లతో ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అక్కినేని సమంత, తమన్నా వంటి వారు ఇప్పటికే పలు సిరీస్‌లలో నటించారు. ఈ నేపథ్యంలోనే రాశీ ఖన్నా కూడా అందులో నటించేందుకు సిద్ధమైందని సమాచారం. తెలుగు డైరెక్టర్లు రాజ్, డీకే తెరకెక్కించనున్న ఓ వెబ్ సిరీస్ ద్వారా ఈమె డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టబోతుందని తెలిసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో దీన్ని నిర్మించనుందనే టాక్ వినిపిస్తోంది.

'ద ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ద్వారా తమ సత్తాను దేశం మొత్తానికి పరిచయం చేశారు తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, డీకే కృష్ణ. దీనికి కొనసాగింపుగా 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'ను కూడా రూపొందించారు. వీటితో పాటు ఎన్నో వెబ్ సిరీస్‌లను చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వీళ్లు యాక్షన్ జోనర్‌లో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించబోతున్నారట. ఇందులో బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ లీడ్ రోల్ చేస్తుండగా.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఇందులోనే ఫీమేల్ లీడ్‌గా రాశీ ఖన్నా నటించనుంది. ఈ షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుందని టాక్.