యశోద సినిమా విడుదలపై సమంత ఎమోషనల్.. మీరు నా కుటుంబం అంటూ..

టాలెంటెడ్ హీరోయిన్ సమంత ఇటీవల తనకు అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె త్వరగా కోలుకోవాలని మళ్లీ ఎప్పటిలాగే సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొనాలి అని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకున్నారు. ఇక సమంత కూడా యశోద ప్రమోషన్ లో పెద్దగా పాల్గొనలేకపోయింది. అప్పటికే హెల్త్ కొంత ఇబ్బంది పెడుతున్నప్పటికి డబ్బింగ్ కూడా కష్టపడి చెప్పింది.

ఇక చిత్ర యూనిట్ సభ్యులందరు కూడా ఆమెను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. సమంత కూడా తన శక్తి మేరకు ప్రమోషన్స్ లో పాల్గొనే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఈ తరుణంలో యశోద సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుండడంతో డీసెంట్ టాక్ అయితే అందుకుంటోంది. ఇక సినిమా విడుదల సందర్భంగా సమంత సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది.

గతంలో కంటే ఈసారి సినిమాను ప్రమోట్ చేయడంలో మీ అందరి సహకారం ఎక్కువగా ఉంటుంది అని ఆశిస్తున్నాను. అలాగే ప్రార్థిస్తున్నాను కూడా. విడుదలకు ముందు మీరు నాపై యశోద పై చూపిస్తున్న ఆప్యాయత ఎంతో బాగుంది ఈ విషయంలో మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీరు నా కుటుంబంతో సమానం. మీరు సినిమాను ఆస్వాదిస్తారు అని ఆశిస్తున్నట్లుగా సమంత సోషల్ మీడియాలో ఫాన్స్ కు కృతజ్ఞతలు తెలిపింది.

Samantha ruth prabhu emotional post on yashoda movie release day

ఇక పాన్ ఇండియా సినిమాగా తెరపైకి వచ్చిన యశోద సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఇక సినిమాకు యూఎస్ ప్రీమియర్స్ నుంచి కూడా డీసెంట్ టాక్ అయితే వచ్చింది. సమంత ఈ సినిమాలో అద్భుతంగా నటించింది అంటూ అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. హరి హరీష్ దర్శకత్వ ద్వయం తెరపైకి తీసుకు వచ్చిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. దాదాపు 35 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ అందుకుంటుంది అని కూడా నిర్మాత ఎంతో నమ్మకంతో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X