‘ఆ విషయంలో మనసు విరిగిపోయింది’: సమంత ఎమోషనల్ కామెంట్స్

Samantha Ruth Prabhu: సినీ తారలు కేవలం సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడమే కాదు.. కొందరు స్టార్స్ ఇతరుల లైఫ్‌లోనూ స్ఫూర్తినివ్వాలనే అభిప్రాయంతో ముందుకు సాగుతున్నారు. అటువంటి వారిలో ముందుండే పేరు సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu). సోషల్‌ మీడియాలో ఎప్పుడూ తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తన బాధలను , అభిప్రాయాలను, అనుభవాలను ఫ్యాన్ పంచుకుంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌తో ముచ్చటించారు. వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమిచ్చారు. అలాగే.. విద్యార్థులకు ఇచ్చిన సూచనలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ ఏమన్నారంటే..?

మార్కులు కాదు మానవత్వం నేర్చుకోండి
ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిన చర్చలో ఒక విద్యార్థి సమంతను 'చదువుతో పాటు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? సమయం దొరకడం లేదు'అని అడిగాడు. దీనికి సమంత తనదైన శైలిలో స్పందిస్తూ.. 'నిజాయతీగా చెప్పాలంటే.. నేను విద్యార్థిగా ఉండి చాలా కాలమైంది. కానీ ఇప్పటి పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని వింటున్నాను. జీవితం అంటే కేవలం గ్రేడులు, మార్కులు మాత్రమే కాదు'అని పేర్కొన్నారు. 'మంచి మార్కులు తెచ్చుకోవడం కంటే మంచి మనిషిగా ఎదగడం ముఖ్యం. మానవతా విలువలు, దయ, సానుభూతి మనల్ని నిజమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి," అని సమంత స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పారు.

Samantha Ruth Prabhu Inspires Students with Powerful Life Message

ఇవే నిజమైన పాఠాలు
సమంత తన స్కూల్ రోజులను గుర్తుచేసుకున్నారు. "నేను చదివిన పాఠాలు ఇప్పుడు ఒక్కటీ గుర్తు లేదు. కానీ, స్నేహం, దయ, సానుభూతి, ఇతరుల పట్ల గౌరవం అనేవి నా జీవితానికి ఆధారంగా మారాయి. మంచి మనిషిగా ఎలా ఉండాలో నేను పాఠశాలలోనే నేర్చుకున్నాను. అదే నాకు జీవితంలో ముందుకు సాగటానికి తోడ్పడాయి,"అని అన్నారు. ఆమె చెప్పిన ఈ మాటలు చాలా మందిని తాకుతున్నాయి. సోషల్ మీడియాలో స్టూడెంట్స్, పేరెంట్స్ ఆమె మాటలను షేర్ చేస్తూ.. ఇది నిజమైన లైఫ్ లెసన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

విద్యార్థుల ఆత్మహత్యలపై ఆవేదన
సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సమయంలో సమంత ఒక ఆందోళనకరమైన విషయంను ప్రస్తావించారు. 2023లో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగినట్టు తెలిపే ఓ వార్తను పంచుకుంటూ.. ఆ విషయంలో నా మనసు విరిగిపోయింది అంటూ.. తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఆ రిపోర్టు ప్రకారం.. మహారాష్ట్రలో అత్యధిక విద్యార్థి ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. ఆ వార్తను షేర్ చేస్తూ సమంత హార్ట్‌బ్రేక్ ఎమోజీతో తన బాధను వ్యక్తం చేశారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం పై మరింత శ్రద్ధ పెట్టాలని పరోక్షంగా సూచించారు.

నిర్మాతగా సమంత
సమంత ప్రస్తుతం తన కెరీర్‌లో మరో కొత్త చాప్టర్‌ను ప్రారంభించబోతున్నారు. ఇటీవల ఆమె 'శుభం' సినిమాతో నిర్మాతగా మారారు. అదే బ్యానర్‌లో తన తదుపరి తెలుగు సినిమా "మా ఇంటి బంగారం" షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా షూట్‌ ప్రారంభం కానున్నందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. విద్యార్థులు ఆమె చెప్పిన విలువలను పోస్టుల రూపంలో షేర్ చేస్తున్నారు. "ఇది మార్కుల యుగం కాదు - విలువల యుగం కావాలి" అంటూ సమంత ఇచ్చిన ఈ సందేశం విద్యార్థుల్లో సానుకూల ఆలోచనలను నింపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X