Asin: కూతురిని సిద్ధం చేస్తున్న గజిని బ్యూటీ.. ఎంత క్యూట్ గా ఉందొ.. ఫొటోస్ వైరల్
కొంతమంది హీరోయిన్స్ ఎక్కువ కాలం అదే స్టార్ డమ్ తో కొనసాగలేకపోయినా కూడా ప్రేక్షకలు అంత ఈజీగా మర్చిపోలేరు. వారు చేసిన సినిమాలు నిత్యం వారిని గుర్తు చేస్తూనే ఉంటాయి. అలాంటి బ్యూటీలలో ఆసిన్ కూడా ఉంది. ఇక ఈ బ్యూటీ కెమెరా ముందుకు వచ్చి చాలా కాలమయ్యింది. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పటికప్పుడు తన క్రేజ్ ను పెంచుకుంటూనే ఉంది. ఇక రీసెంట్ గా తన కూతురికి సంబంధించిన ఒక క్యూట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

అప్పటి నుంచి బిజీబిజీగా
అసిన్ పూర్తి పేరు ఆసిన్ తోట్టుంకల్. మలయాళం ముద్దుగుమ్మ అయినప్పటికీ దాదాపు అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేసి బాక్సాఫీస్ హిట్స్ అందుకుంది. తెలుగులో అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ అప్పటి నుంచి బిజీబిజీగా మారిపోయింది. అప్పట్లో ఒక్క నెలలోనే నాలుగైదు సినిమాలకు సైన్ చేసింది.

గజిని సినిమా తరువాత
ఆసిన్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ హిట్ గా నిలిచేవి. ఇక గజిని సినిమా తరువాత అమ్మడి కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. హిందీ గజినిలో కూడా ఆమెనే సెలెక్ట్ చేసుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు అందుకుంది.

మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడితో పెళ్లి
ఇక సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ చివరగా అబిషేక్ బచ్చన్ తో ఆల్ ఈజ్ వెల్ అనే సినిమా చేసింది. అసిన్ మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను 2016లో పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దురమయ్యింది. ఆసిన్ కు ఒక కూతురు కూడా జన్మించింది.

కూతురిని సిద్ధం చేస్తున్న ఆసిన్
ఇక తన నాలుగేళ్ళ పాపతో ఆసిన్ హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. తన పేరు అరిన్. రీసెంట్ గా పాపకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసిన ఈ సీనియర్ హీరోయిన్ మూడేళ్ళ తన పాప కథక్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. చూస్తుంటే ఆసిన్ కూతురు కూడా బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











