Shilpa Shettyకి ఊరట.. సమన్ల జారీపై ముంబై పోలీసుల క్లారిటీ..

పోర్న్ రాకెట్ కేసులో భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత అందరి దృష్టి హీరోయిన్ శిల్పాశెట్టిపై పడింది. పోర్నోగ్రాఫిక్ కంటెంట్ క్రియేషన్ వ్యవహారంలో శిల్పాశెట్టికి ఏమైనా పాత్ర ఉందా అనే కోణంలో మీడియా ఆరా తీసింది. పలు మీడియా ఛానెల్స్‌లో శిల్పాశెట్టికి కూడా సమన్లు జారీ చేసింది. అయితే ఈ కేసులో ఆమెకు సమన్లు జారీ చేసే విషయంపై ముంబై పోలీసులు క్లారిటీ ఇస్తూ..

 సమన్లు జారీ చేయడం లేదు..

సమన్లు జారీ చేయడం లేదు..

ముంబై సైబర్ క్రైమ్ విభాగానికి సంబంధించిన అధికారి ఒకరు ఈ ఊహాగానాలపై స్పందిస్తూ. శిల్పాశెట్టి తన కుమారుడు వియాన్ పేరిట స్థాపించిన వియాన్ ఇండస్ట్రీస్‌లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే పోర్న్ రాకెట్‌తో ఈ సంస్థకు సంబంధాలు లేవని స్పష్టమైంది. అందుకే ఆమెకు సమన్లు జారీ చేయడం లేదు. అయితే ఇప్పటికే వియన్ ఉద్యోగి ఈశ్వర్‌ను విచారించాం అంటూ వివరణ ఇచ్చారు.

 వియాన్ కంపెనీ ఉద్యోగులకు సమన్లు

వియాన్ కంపెనీ ఉద్యోగులకు సమన్లు

అయితే వియాన్ ఇండస్ట్రీస్ సిబ్బందిని విచారించడానికి సమన్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది. విచారణకు వియాన్ సిబ్బంది సహకరించడం లేదు. అందుకే సమన్లు జారీ చేశాం. ఈ కంపెనీకి నిధులు ఎలా? ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం అత్యంత అనుమానాస్పదంగా మారింది. ఈ క్రమంలో వియాన్ ఇండస్ట్రీస్ సిబ్బందిని విచారించేందుకు సిద్ధమయ్యాం అని ఫైనాన్స్, ఐటీ అండ్ ప్రాపర్టీ సెల్ అధికారులు పేర్కొన్నారు.

శిల్పాశెట్టికి సంబంధం లేదు

శిల్పాశెట్టికి సంబంధం లేదు

ఇంటర్నేషనల్ పోర్న్ రాకెట్ కేసులో భాగంగా యూకేకు చెందిన కెన్రిన్ అనే కంపెనీ, అలాగే హాట్ షాట్స్ యాప్ ఓనర్‌పై దర్యాప్తు చేస్తున్నాం. వారిపై తీవ్రమైన ఆరోపణలు, ఫిర్యాదు రావడంతో దర్యాప్తు వేగవంతం చేశాం. ఈ సంస్థలతో శిల్పాశెట్టికి ఎలాంటి సంబంధం లేదు అంటూ అధికారి పేర్కొన్నారు.

Recommended Video

Shilpa Shetty Hosts A Grand Birthday Bash For Hubby Raj Kundra | Filmibeat Telugu
 కోర్టుకు రాజ్ కుంద్రా

కోర్టుకు రాజ్ కుంద్రా

పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా జూలై 23వ తేదీ వరకు పోలీస్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. శుక్రవారంతో ఆయన రిమాండ్ ముగియడంతో రాజ్ కుంద్రాను ముంబైలోని కిల్లా కోర్టులో హాజరుపరుచనున్నారు. ఈ క్రమంలో తదుపరి విచారణ కోసం ఆయనను పోలీస్ రిమాండ్ అప్పగించాలని అధికారులు కోరే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

రాజ్ కుంద్రాను జూలై 19వ తేదీన అరెస్ట్ చేసిన తర్వాత అధికారులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 70 వీడియోలను నిశితంగా పరీక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X