For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా వల్లే మా నాన్న మృత్యువు అంచుల వరకు.. మా అమ్మపై అలాంటి దుష్ప్రచారం... శివానీ రాజశేఖర్ భావ్వోద్వేగం

  |

  శేఖర్ సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా అమ్మ జీవిత గారు. చాలా మంది జీవితపై కామెంట్లు చేస్తుంటారు. జీవిత అందర్నీ కంట్రోల్ చేస్తుంటారు. మీ ఫ్యామిలీ కంట్రోల్ అంతా ఆమె చేతిలో ఉంటుంది. రాజశేఖర్ కెరీర్ సరైన దారిలో వెళ్లకుండా జీవిత వెళ్లనివ్వడం లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా మా ఫ్యామిలీపై, జీవితపై కామెంట్లు చేస్తుంటారు. అలాంటి కామెంట్లను మేము పట్టించుకోం. అని శివానీ ఎమోషనల్ మాట్లాడారు. శేఖర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివానీ మాట్లాడుతూ..

  బురద జల్లే వారికి గుణపాఠం

  బురద జల్లే వారికి గుణపాఠం

  మా అమ్మపై బురద జల్లడానికి ప్రయత్నించే ప్రతీ వ్యక్తికి మా అమ్మ గుణపాఠం నేర్పుతుంది. శేఖర్ మూవీ విషయానికి వస్తే.. జీవిత గారు చక్కగా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో నాకు ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను. ఈ సినిమాను చాలా చాలా బాగా డైరెక్ట్ చేశావు. శేఖర్ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని శివానీ అన్నారు.

  నా వల్లే నాన్నకు కోవిడ్

  నా వల్లే నాన్నకు కోవిడ్

  శేఖర్ సినిమా ప్రారంభానికి 10 రోజుల ముందు నా నుంచి డాడీకి కోవిడ్ సోకింది. నాకు మూడు రోజుల్లో తగ్గిపోయింది. డాడీకి చాలా చాలా సీరియస్ అయింది. 45 రోజులకుపైగా హాస్పిటల్‌లో ఉన్నారు. ఓ దశలో ఆయన ఆక్సిజన్ లెవెల్స్ 56కి పడిపోయాయి. మా ఇంటికి పెద్ద దిక్కు మా నాన్న. అలాంటి వ్యక్తి తీవ్రమైన అనారోగ్యానికి గురైతే.. మేమంత ఆందోళనపడ్డాం. మాకు ఏమైనా అయితే ఆయన మాకు వైద్యం చేసే వారు. అలాంటి వ్యక్తి చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు అని శివానీ తెలిపారు.

  శ్వాస ఆడటం లేదని నాన్న అంటే..

  శ్వాస ఆడటం లేదని నాన్న అంటే..

  హాస్పిటల్‌లో మా నాన్న పరిస్థితి దారుణంగా మారిపోవడంతో మా జీవితం స్తంభించిపోయిందనిపించింది. ఓ రోజు మా నాన్న శ్వాస ఆడటం లేదని చెప్పడంతో ఆ స్థితిలో మా పరిస్థితిని మాటల్లో చెప్పలేం. నా వల్లే నాన్నకు కోవిడ్ రావడంతో చాలా బాధపడ్డాను. నా సినిమాలు రిలీజ్ కాకపోవడం మరో టెన్షన్. అందరూ నీ జాతకంలో దోషం ఉందేమో. పూజలు చేసుకోండి. మంచి జరుగుతుంది. మా నాన్నకు నేనే బ్యాడ్ లక్ అనిపించింది అని శివానీ అన్నారు.

  రాజశేఖర్ రియల్ ఫైటర్

  రాజశేఖర్ రియల్ ఫైటర్

  నాన్న ఆరోగ్యం ఓ దశలో మరింత విషమించింది. డాక్టర్లు 50 శాతమే భరోసా ఇచ్చారు. దాంతో నాన్న వద్దకు వెళ్లి నా వల్లనే నీకు ఈ పరిస్థితి. నీకు ఏమైనా అయితే భరించలేను. నీవు ఎలాగైనా త్వరగా అనారోగ్యం నుంచి బయటపడాలి. కరోనాతో నీవు ఫైట్ చేయమని చెప్పాను. అప్పుడు ముఖంపై ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసి.. నీవు కాకపోతే.. మరొకరితో కరోనా సోకేది. నీవు బాధపడవద్దు అని చెప్పారు. అప్పుడు నాకు మా నాన్న సూపర్ హీరో. రియల్ ఫైటర్ అనే ఫీలింగ్ కలిగింది అని శివానీ భావోద్వేగానికి గురైంది.

  ప్రాణాలకు హానీ ఉన్నా శేఖర్ మూవీ కోసం

  ప్రాణాలకు హానీ ఉన్నా శేఖర్ మూవీ కోసం

  స్నేహితులు, సన్నిహితులు, అభిమానుల వల్ల ప్రార్థనల వల్ల నాన్న ఆరోగ్యం నుంచి కోలుకొన్నారు. దాదాపు 15 కేజీలు బరువు తగ్గారు. అనారోగ్యం నుంచి కోలుకొన్న తర్వాత నడక నేర్చుకొన్నాడు. జిమ్‌కు వెళ్లి మళ్లీ ఫిట్ అయ్యారు. తన ప్రాణాలను హాని కలుగుతుందని తెలిసి కూడా సినిమాలో సిగరేట్ తాగాడు. శేఖర్ సినిమా కోసం నాన్న రాజశేఖర్ ఏ పరిస్థితుల్లోను కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమా మా నాన్న కోసం ఆడాలి. మా నాన్న పునర్జన్మ తర్వాత వస్తున్న చిత్రం శేఖర్. ఈ సినిమాను ఆదరించండి అంటూ శివానీ స్పీచ్ ఎమోషనల్‌గా సాగింది.

  English summary
  Hero Doctor Rajashekar' Shekar movie pre release event held in Hyderabad. In this occassion, actress Shivani made speech emotional.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X