For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Silk Smitha నన్ను దారుణంగా వాడుకొని, దేవుడనే వాడు ఉంటే వారందరికి శిక్ష.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్!

  |

  నటి, శృంగార తార సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆమె మరణించి 26 ఏళ్లు కావొచ్చినా.. ఆమె మరణం వెనుక ఎన్నో అనుమానాలు వెంటాడుతున్నాయి. ఆత్మహత్య తర్వాత ఆమె రాసిన లేఖ ఎంతో మందిని కంటతడి పెట్టడమే కాకుండా గుండెను పిండేసింది. సిల్క్ స్మిత 62వ జన్మదినం.. డిసెంబర్ 2 సందర్భంగా ఆమె రాసిన చివరి లేఖ గురించిన పూర్తి వివరాలు..

  బాబు నాపై ప్రేమను చూపించాడు

  బాబు నాపై ప్రేమను చూపించాడు

  సిల్క్ స్మిత తన మరణానికి ముందు రాసిన సూసైడ్ లెటర్‌లో.. నటిగా మారేందుకు నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో కేవలం నాకే తెలుసు. అయితే నన్ను ఎవరూ ఇష్టపడలేదు. కేవలం డాక్టర్ రాధాకృష్ణన్ (బాబు) మాత్రమే నాపై కొంత ప్రేమను కురిపించాడు. మిగితా వాళ్లంతా నా శరీరాన్ని వాడుకొనేందుకు ప్రయత్నించారు. ప్రతీ ఒక్కరు నా పనిని దుర్వినియోగం చేశారు. అయినా నా జీవితంలో ఎన్నో కోరికలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి అని తెలిపారు.

  ప్రతీ ఒక్కరి కోరికలు తీర్చాలని..

  ప్రతీ ఒక్కరి కోరికలు తీర్చాలని..

  కేవలం నాలో కోరికలు మాత్రమే మిగిలిపోలేదు. నన్ను కోరుకొన్న వారందరి కోరికలు తీర్చాలని ఉంది. అయితే నా జీవితంలో నేను ఎక్కడికి వెళ్లినా.. ఏ ఎత్తుకు ఎదిగినా ప్రశాంతత ఎప్పుడూ లభించలేదు. ప్రతీ ఒక్కరు నాతో వ్యవహరించిన తీరు నాకు ఇబ్బందిగా ఉండేది. ప్రతీ ఒక్కరు నన్ను డిస్ట్రబ్ చేశారు. అలాంటి వేధింపులకు మరణమే శాశ్వతం అనిపిస్తున్నది. నా చుట్టూ ఉన్న ప్రతీ ఒక్కరికి నేను చాలా చేశాను అని సిల్క్ స్మిత తన లేఖలో పేర్కొన్నారు.

  నా జీవితానికి ఇదే ముగింపా?

  నా జీవితానికి ఇదే ముగింపా?

  నా జీవితం తెరిచిన పుస్తకం లాంటింది. నా జీవితానికి ఇదే ఇలాంటి ముగింపు సమంజసమా? నన్ను ఆదరించిన బాబుకు నా సంపాదనలో సగం ఇస్తాను. ఎందుకంటే నాకు ఇష్టమైన వారిలో ఆయన ఒకరు. నన్ను ఆయన కూడా నిజాయితీగా ప్రేమించారు. నాతో చీటింగ్ చేయని ఎవరంటే రాధాకృష్ణన్ అని చెప్పగలుగుతాను. నన్ను చీట్ చేసిన వారు ఎవరనీ అడిగినా ఆయన పేరే చెబుతాను అని సిల్క్ స్మిత చెప్పారు.

  దేవుడనే వాడు ఉంటే.. వారందరికి శిక్ష

  దేవుడనే వాడు ఉంటే.. వారందరికి శిక్ష

  దేవుడు అనే వాడు ఉంటే.. నన్ను మోసగించిన ప్రతీ ఒక్కరిని శిక్షిస్తాడు. నన్ను చాలా రకాలుగా చాలా మంది మోసగించారు. ఆ విషయం తలుచుకొంటే ప్రతీ రోజు గుండె ముక్కలవుతుంది. అయితే వాళ్లు మాత్రం నాకు మంచే చేశారని అనుకొంటారు. బాబు అనే వ్యక్తి కూడా అందులో ఒకరు. నా కోసం బంగారం కొన్నాడు. కానీ బాబు నాకు వాటిని అందజేయలేదు. ఆ విషయం నాకు బాధలేదు. ఎందుకంటే నేను ఇక బతికి ఉండను కదా అని సిల్క్ స్మిత అన్నారు.

  ఈ భూమ్మీదకు ఎందుకు వచ్చానా?

  ఈ భూమ్మీదకు ఎందుకు వచ్చానా?

  ఇలాంటి బాధలు చూసుకొంటే.. దేవుడు నన్ను ఎందుకు ఈ భూమ్మీదకు తీసుకొచ్చాడా? అనే అనుమానం కలుగుతుంది. రాము, రాధాకృష్ణన్ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను. కానీ వారు నాకు చేసింది చాలా దారుణం. వాళ్లు వ్యవహరించిన తీరుకు చచ్చిపోవాలని నిర్ణయించుకొన్నాను అని సిల్క్ స్మిత లేఖలో పేర్కొన్నారు.

  ఆ జీవితం కోసం అంటూ

  ఆ జీవితం కోసం అంటూ

  సినీ పరిశ్రమలో ఎంతో మంది నా శరీరాన్ని వాడుకొన్నారు. నా వర్క్‌ను వాడుకొని చాలా మంది లాభపడ్డారు. బాబుకు తప్ప నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోను. గత ఐదేళ్లుగా ఓ వ్యక్తి నీకు జీవితాన్ని ప్రసాదిస్తానని చెబుతున్నాడు. ఆ జీవితం కోసం నేను ఎంతగా ఎదురు చూశానో నాకు తెలుసు. ఆయన చెప్పిన మాటల్లో నిజం లేదని తెలిసి చాలా బాధపడ్డాను. దాంతో జీవితం మీద విరక్తి పుట్టింది. ఈ లేఖను రాయడం కూడా చాలా కష్టమైంది. నా మరణాతరం ఎవరికైతే దక్కుతుందో వారికి నాకు అత్యంత ఇష్టమైన జ్యువెల్లరీని ఇక కొనలేను అని సిల్క్ స్మిత విషాదంతో కూడిన లేఖను రాసింది.

  English summary
  Silk Smitha suicide note goes viral after her death. She revealed in her letter that, Everyone exploited physically, God will punish them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X