ఆ వెబ్‌సైట్లలో స్టార్ హీరోయిన్ ప్రైవేట్ ఫోటోలు.. మీ అంతు చూస్తానంటూ వార్నింగ్
ఇండియాలో నటీనటుల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రేజ్‌నే కొన్ని సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లతో తమ ఉత్పత్తులను ప్రచారం చేయించుకుంటూ కోట్లాది రూపాయలను పారితోషికంగా చెల్లిస్తూ ఉంటాయి. 30 సెకన్ల వీడియో నటిస్తే కోట్లు వచ్చి పడుతుండటంతో స్టార్స్ కూడా బ్రాండ్ అండార్స్‌మెంట్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే కొన్ని సంస్థలు మాత్రం నటీనటులను ఫ్రీగా వాడేస్తున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. ఈ వివరాల్లోకి వెళితే..
దబాంగ్‌తో క్రేజ్
బాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు శత్రఘ్న సిన్హా నటవారసురాలిగా చిత్రసీమలో అడుగుపెట్టారు సోనాక్షి సిన్హా. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ మూవీతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. దబాంగ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆయనకు వరుసపెట్టి అవకాశాలు పోటెత్తాయి. రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, హాలీడే: ఏ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ సినిమాలతో వరుస హిట్స్‌ను తన సొంతం చేసుకున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్న సూత్రాన్ని సోనాక్షి బాగా ఫాలో అయ్యారు. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం నెంబర్స్‌తోనూ సోనాక్షి రెండు చేతులా సంపాదించింది. గ్లామర్ షో చేసినా హరోయిన్ ఓరియెంట్ చిత్రాలతో తన మార్క్ చూపించారు. గతేడాడి హీరామండీతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు.

జహీర్ ఇక్బాల్‌తో ప్రేమ, పెళ్లి
హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడే ఆదిత్య ష్రాఫ్, బంటీ సాజెదా, రణవీర్ సింగ్, అర్జున్ కపూర్‌లతో ఆమె డేటింగ్ చేసినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే డబుల్ ఎక్స్ఎల్ సినిమాలో తనతో కలిసి నటించిన హీరో జహీర్ ఇక్బాల్‌తో ప్రేమలో పడిన సోనాక్షి పెద్దల అంగీకారంతో పెళ్లాడారు. వీరిద్దరూ ఎప్పుడు గుడ్‌న్యూస్ చెబుతారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు అభిమానులు. గతేడాది దీపావళి సందర్భంగా ముంబైలో జరిగిన దివాళీ బాష్‌లో సోనాక్షి కాస్త బొద్దుగా కనిపిస్తుండటంతో పాటు పొట్ట భాగం ముందుకొచ్చినట్లుగా ఉంది. దీంతో సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చాయి. వీటిని భార్యాభర్తలిద్దరూ ఖండించారు. ఇక సోనాక్షి సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల నికితా రాయ్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా తర్వాత ఆమె కొత్తగా ఏ మూవీలోనూ నటించలేదు.
సోషల్ మీడియాలో యమా యాక్టీవ్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సోనాక్షి సిన్హా ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలతో పాటు తన హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో ఓ వార్నింగ్ ఇవ్వడంతో నెటిజన్లు షాకయ్యారు. దీనికి కారణం లేకపోలేదు.. ఎప్పటికప్పుడు తాను సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రైవేట్ ఫోటోలు పలు ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో కనిపించడంతో సోనాక్షి సిన్హా షాకయ్యారు. దీని గురించే ఆమె వార్నింగ్ ఇచ్చారు.
నా అనుమతి తీసుకోరా?
తను ఆన్‌లైన్‌లో ఎక్కువగా షాపింగ్ చేస్తుంటానని, అయితే కొన్ని కంపెనీల వెబ్‌సైట్స్‌లో నా ఫోటోలు చూసి షాకయ్యానని సోనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి సమాచారం లేకుండా, తన అనుమతి లేకుండా నా ఫోటోలను ఎలా ఉపయోగించుకుంటారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి పనులు ఏ మాత్రం సరికావని.. ఓ సెలబ్రెటీగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త దుస్తులు, ఆభరణాలు ధరిస్తానని.. వాటి కంపెనీల డిటెయిల్స్‌ను వివరిస్తూ వాటికి క్రెడిట్ ఇస్తానని సోనాక్షి చెప్పారు. అలా పోస్ట్ చేసినంత మాత్రాన నా ఫోటోలను మీ వెబ్‌సైట్స్‌లో వాడుకుంటారా అంటూ ఆమె ఫైర్ అయ్యారు. వాటిని బేషరతుగా తొలగించాలని, లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని సోనాక్షి హెచ్చరించారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరి సదరు కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











