దేశముదురు లాంటి హిట్టు కావాలని తెలుగు సినిమాలు రిజెక్ట్ చేస్తోంది!
యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని అంటే తెలియని సౌత్ ఆడియెన్స్ ఉండరు. దేశముదురు సినిమాతో టీనేజ్ లోనే జనాలను ఎట్రాక్ట్ చేసిన హన్సిక యాపిల్ బ్యూటీ ఆన్స్ బ్రాండ్ ఇమేజ్ ని సెట్ చేసుకుంది. గ్లామర్ పరంగా నటన పరంగా అమ్మడు ఈ దశాబ్ద కాలంలో చాలానే డెవలప్ అయ్యింది. అలాగే అప్పుడప్పుడు డేటింగ్ వంటి రూమర్స్ తో వార్తల్లో నిలుస్తోంది.
అసలు మ్యాటట్ లోకి వస్తే.. హన్సిక మోత్వాని ఈ మధ్య టాలీవుడ్ కి చాలా దూరంగా ఉంటోంది. ఎక్కువగా తమిళ్ సినిమాలతోనే బిజీగా ఉంటోంది. చివరగా ఈ బ్యూటీ తెలుగులో చేసిన సినిమా గౌతమ్ నంద. 2017లో వచ్చిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆ మధ్య ఎన్టీఆర్ బయోపిక్ లో జయప్రదగా కనిపించి మాయమైంది. ఇక ఇప్పటివరకు మరో తెలుగు సినిమా చేయలేదు.

అందుకు కారణం ఆమె మనసుకు నచ్చిన కథలు రావడం లేదట. రెండు నెలల క్రితం కొన్ని ఆఫర్స్ వస్తే.. మోహమాటం లేకుండా రిజెక్ట్ చేసిందట. దేశముదురు లాంటి హిట్టు కొట్టాలని సరైన కథల కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతోంది. అయితే ఈ యాపిల్ బ్యూటీతో ప్రస్తుతం స్టార్ హీరోలు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. కోలీవుడ్ లో కూడా మీడియమ్ హీరోలతోనే వర్క్ చేస్తోంది. ఇక బాలీవుడ్ లో కూడా అడుగులు వేయడానికి అమ్మడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











