ఈ హీరోయిన్ ఎక్కడా తగ్గట్లేదుగా.. బీచ్ లో బికినీలో యోగా ఫోజులు!
బెంగాలీ భామ త్రిధా చౌదరి ముందు బెంగాలీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అనుకోకుండా తెలుగు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే మెప్పించింది. తెలుగులో దాదాపు మూడు సినిమాల్లో నటించిన ఈ భామ గత కొద్ది కాంగా ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది. తాజాగా అమెరికాలో బీచ్ లో బికినీతో యోగా చేస్తూ ఇచ్చిన హాట్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే.

సినిమాల మీద మక్క్వువతో
పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో పుట్టిన త్రిధా చౌదరికి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఆసక్తి ఎక్కువే. అలా ఆమె అనేక ప్రయత్నాలు చేసి బెంగాలీ సినిమా మిషావర్ రాహోశ్యో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరో రెండు బెంగాలీ సినిమాల్లో నటించినా ఆమెకు అనుకున్నంత క్రేజ్ అయితే రాలేదు.

అలా తెలుగు ఎంట్రీ
అయితే ఆ సినిమాల కారణంగా ఈ భామకు హీరో నిఖిల్ నటించిన సూర్య వర్సెస్ సూర్యలో హీరోయిన్ గా మాత్రం అవకాశం దక్కింది. అలా ఆ సినిమాలో తెలుగు డెబ్యూ ఇచ్చి సంజన అనే పాత్రలో ఈ భామ అదరగొట్టేసింది. అయితే సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు కూడా దక్కలేదు అని చెప్పాలి.

కలిసి రాలేదని
తెలుగులో మంచి అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ తన సొంత ఇండస్ట్రీ బెంగాలీలో మళ్ళీ రెండు సినిమాలు చేసింది. ఆ తర్వాత ఏడాది మనసుకు నచ్చింది అనే మరో తెలుగు సినిమాలో అవకాశం రావడంతో ఈ భామ నికిత అనే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

ఎన్ని సినిమాలు చేసినా నో యూజ్
అయితే ఆ రెండు సినిమాలు చేసినట్టు ఎక్స్ పీరియన్స్ అయితే వచ్చింది కానీ తెలుగులో అనుకున్నంత గుర్తింపు అయితే దక్కలేదు. అవకాశాలు మాత్రం అంతంతగానే ఉన్న క్రమంలో తెలుగులో 7 అనే సినిమాలో హవీష్ సరసన నటించింది. ఏడుగురు హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో ఆమె ఒక హీరోయిన్ గా నటించింది.

ఆ సిరీస్ తో
ఇక ఆ సినిమా కూడా నిరాశపరచడంతో ఆమె బాలు అడుసుమిల్లి డైరెక్షన్ లో నుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అనే సినిమాలో నలుగురు హీరోయిన్స్ లో ఒకరిగా నటించింది. ఇక ఆమె హిందీలో చేస్తున్న ఆశ్రమ్ అనే ఒక వెబ్ సిరీస్ లో బబిత అనే పాత్రకు మాత్రం ఈమెకు హాట్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది.

బికినీతో యోగా
బాబీ డియోల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సిరీస్ లో ఒక వేశ్య పాత్ర పోషించడమే కాక అనేక హాట్ సీన్స్ లో నటించడంతో ఈమెకు మంచి క్రేజ్ లభించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ పిక్స్ తో హల్చల్ చేస్తూ ఉండే ఈ భామ తాజాగా యోగా డే సంధర్భంగా బీచ్ లో బికినీతో యోగా చేస్తూ ఫోజులిచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె బికినీ బీచ్ యోగా మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











