»   » సస్పెన్స్ కు తెర: పద్మ గర్బానికి కారణం అతడే..!

సస్పెన్స్ కు తెర: పద్మ గర్బానికి కారణం అతడే..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సంతతికి చెందిన హాలీవుడ్ మోడల్ పద్మ లక్ష్మి ఇటీవలే ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె గర్భం దాల్చినప్పుటి నుండీ అందుకు కారణం ఎవరు అనే విషయం సస్పెన్స్ గానే మిగిలింది. లక్ష్మి కూడా ఈ ప్రశ్న అడిగితే సమాదానం చెప్పకుండా దాటవేసేది..మరీ గుచ్చి అడిగితే కస్సుమనేది. దీంతో మీడియాలో కూడా ఆమె పాపకు తండ్రి ఎవరు అనే విషయమై ఆసక్తికరమయిన చర్చ జరిగింది.

ఇప్పుడీ సస్పెన్స్ కు తెరదించుతూ బిలియనీర్ కంప్యూటర్ మేకర్ సోదరుడు అడమ్ డెల్, పద్మ లక్ష్మి ద్వారా తను తండ్రి అయినందుకు చాలా సంతోషంగా వుంది అని ప్రకటించాడని ది న్యూయార్క్ పోస్ట్ వార్తా పత్రిక తెలిపింది. కానీ ఈ విషయాన్ని పద్మ లక్ష్మి దృవీకరించాల్సి వుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu