»   » హ్యారీ పోట్టర్ హీరో రాడ్‌క్లిఫ్ కు 'ఏడీహెచ్‌డీ' రుగ్మత

హ్యారీ పోట్టర్ హీరో రాడ్‌క్లిఫ్ కు 'ఏడీహెచ్‌డీ' రుగ్మత

Posted By:
Subscribe to Filmibeat Telugu
Daniel Radcliffe suspects he has Adhd
లండన్‌: హ్యారీ పోట్టర్ చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను, డబ్బుని సంపాదించుకున్న స్టార్ హీరో డేనియల్ రాడ్‌క్లిఫ్. ఈ బ్రిటిష్‌ నటుడు అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ఏక్టివిటీ డిజార్డర్‌(ఏడీహెచ్‌డీ) రుగ్మతతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని స్వయంగా రాడ్ క్లిఫ్ ఇంటర్వూలో వెల్లడించారు.

అయిదేళ్ల వయసులో డేనియల్ రాడ్‌క్లిఫ్ నటుడవ్వాలని నిశ్చయించుకున్నాడు. పదేళ్ల వయసు వచ్చేసరికి ప్రపంచ ప్రఖ్యాతిపొందిన నటుడయ్యాడు. అంతేకాదు, కొన్నేళ్లలో ఇంగ్లండ్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కన్నా ధనవంతుడయ్యాడు. అతడి బాల్యంనుంచి యవ్వనం వరకూ ఎదుగుదల ప్రపంచం కళ్లముందే జరిగింది. అతడు 'హారీపోటర్'గా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన డేనియల్ రాడ్‌క్లిఫ్. తన మాయాజాలంతో ప్రపంచ ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాడు.

పదేళ్ల వయసులో బిబిసి నిర్మించిన 'డేవిడ్ కాపర్‌ఫీల్డ్'లో ప్రధాన పాత్రకు ఎన్నికయ్యాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. తరువాత అతడికి 'హారీపోటర్' సినిమాలో 'హ్యారీ' పాత్ర ధరించే అవకాశం వచ్చింది. అతడి స్క్రీన్ టెస్ట్‌చూసిన రచయిత్రి రీలింగ్ 'తన హ్యారీ అచ్చు ఇలానే ఉంటాడ'ని వ్యాఖ్యానించింది. 2001లో 'హారీపోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్' విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా హ్యారీపోటర్‌గా డేనియల్ రాడ్‌క్లిఫ్‌కు ఆదరణ లభించింది. దాంతో వరసగా ఏడు హ్యారీపోటర్ సినిమాల్లో నటించాడు డేనియల్. ఈ సినిమాల ద్వారా దాదాపుగా 60 మిలియన్ డాలర్లపైగా సంపాదించాడు.

సినిమాలలోనే కాదు నాటకాలలో, టీవీలో నటిస్తూ, నటుడిగా మంచి పేరు సంపాదించాడు. ఇలా 'ది జర్నీ ఈజ్‌ది డెస్టినేషన్', 'ది వుమెన్ ఇన్ బ్లాక్' వంటి సినిమాల్లో నటించాడు. 2010కల్లా ప్రిన్స్‌విలియం కన్నా ధనవంతుడుగా గుర్తింపు పొందాడు హ్యారీపోటర్ డేనియల్ రాడ్ క్లిఫ్. దేవుడిని నమ్మని డేనియల్ రాడ్ క్లిఫ్ తాను ధనవంతుడినయినా తనకు పుస్తకాలు కొనడం తప్ప మరో ఖరీదైన అలవాటు లేదంటాడు.

సచిన్ తెండూల్కర్ ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిల్చున్న డేనియల్ రాడ్‌క్లిఫ్, పేద బాలలకు సేవ చేసే సంస్థలకోసం విరివిగా విరాళాలిస్తాడు. గేటీన్‌లలో ఆత్మహత్యలను అరికట్టాలని ప్రయత్నించే 'ది ట్రెవర్ ప్రాజెక్టు'లో పనిచేస్తూ ఎంతోమంది యువకులను ప్రభావితం చేస్తున్నాడు. అతడి పనితీరుకు 'హారీ' అవార్డు పొందాడు. ఈ రకంగా అటు తెరపైనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు హ్యారీపోటర్ డేనియల్ రాడ్ క్లిఫ్.

English summary

 British actor Daniel Radcliffe is convinced he suffers from attention deficit hyperactivity disorder (Adhd). The 'Harry Potter' star suspects his symptoms went unnoticed as the condition wasn't as well known when he was a child."I think I am quite hyper. I think if I'd been born a few years later, I might have been diagnosed with Adhd, but I missed the boat for all those diagnoses," he told Britain's The Guardian.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X