»   » అయ్యో పాపం.. వండర్ ఉమెన్ హీరోయిన్ రెమ్యూనరేషన్ అనుష్క కంటే తక్కువా?

అయ్యో పాపం.. వండర్ ఉమెన్ హీరోయిన్ రెమ్యూనరేషన్ అనుష్క కంటే తక్కువా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రను షేక్ చేస్తున్న వండర్ ఉమన్ చిత్రానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆ చిత్రంలో నటించిన హీరోయిన్స్‌ రెమ్యూనరేషన్ తెలిస్తే అయ్యో పాపం అనాల్సిందే. ఎందుకంటే హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆ చిత్ర హీరోయిన్ గాల్ గడోట్ పారితోషికం కేవలం రూ.1.8 కోట్లు మాత్రమేనట. అంటే బాలీవుడ్ చిత్రాల్లో నటించే అనుష్క శర్మ, కత్రినా కైఫ్ లాంటి వాళ్లు కనీసం రూ.4 లేదా రూ.5 కోట్లు తీసుకొంటారనేది టాక్. టాలీవుడ్‌లో అయితే కాజల్, సమంత లాంటి వారు దాదాపు గాల్ గడోట్ తీసుకొనే మొత్తాన్ని తీసుకొంటారనేది తెలిసిందే.

Gal Gadot's 'Wonder Woman' remuneration was shockingly low

ఎలాంటి అంచనాలు లేకుండా హాలీవుడ్‌లో వండర్ ఉమెన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.3800 కోట్లు వసూళ్లను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన 32 ఏళ్ళ గాల్ గడోట్ పర్ ఫార్మెన్స్ సినీ అభిమానులు నీరాజనం పడుతున్నారు. అయితే ఆమెకి ఇచ్చిన రెమ్యునరేషన్‌పై పలువురు నెటిజెన్లు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. 3800 కోట్ల వసూళ్ళు సాధించిన సినిమా హీరోయిన్ కి అంత తక్కువ ఇవ్వడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

English summary
Gal Gadot may be the face of the biggest superhero movie on the planet right now, but she didn't get paid like it. That movie collected nearly 3800 crores sofar. But reports suggest that Gal Gadot paid only Rs. 1.8 crores only.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X