»   » ఆశక్తికరం: ఆస్కార్ అవార్డుల 'శాపం'

ఆశక్తికరం: ఆస్కార్ అవార్డుల 'శాపం'

Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం హాలీవుడ్ లో ఆస్కార్ అవార్డు శాపం గురించి సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఆస్కార్ అవార్డు రావడం ఓ గొప్ప వరం. ఎంతో కష్టపడితే కానీ ఈ అవార్డు రావడం జరగదు. అలాంటిది ఆస్కార్ శాపం ఎలా అవుతుంది అనుకుంటున్నారా..?? అయితే ఇది చదివితీరాల్సిందే.

ఆస్కార్ అవార్డు పొందడం అదృషటమే కావచ్చు కానీ కథానాయికల విషయంలో మాత్రం ఇది శాపంగానే పరిణమిస్తోందని హాలీవుడ్ వర్గాల భోగట్టా. అదెలాగంటారా..! ఆస్కార్ పొందడానికి ముందు చక్కగా వున్న ప్రతీ నటీమణి, ఆస్కార్ పొందిన తర్వాత ఇళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. ఇటీవలే బ్లైండ్ స్లైడ్ సినిమాలో నటించి, అత్యుత్తమ నటనను కనబరచి ఆస్కార్ సొంతం చేసుకున్న సాంద్రా బుల్లక్ ను తన భర్త మోసగించడంతో ఆమె అతన్ని వీడి వచ్చేయంతో ఈ ఆశక్తికర చర్చకు తెరలేచింది.

ఇంతకు ముందు హిల్లరీ స్వాన్క్, హల్లే బెర్రీ, రీసే విథర్ స్పూన్, జూలియా రాబర్ట్స్ తో పాటు ప్రపంచ అందగత్తెగా పేరొందిన ఏంజలీనా జోలీ వంటి తారలు ఆస్కార్ అవార్డుపొందిన తర్వాత కొద్దిరోజుల్లోనే తమ భర్తల నుండీ విడాకులు తీసుకోవడం జరిగింది. వీరి తర్వాత తాజాగా గత ఏడాది ఆస్కార్ పొందిన కేట్ విన్స్లెట్ కూడా గత కొంతకాలంగా తన భర్త నుండీ దూరంగా వుంటూ నిన్ననే అధికారికంగా విడాకులు పొందింది. ఇక ఇప్పుడు సాంద్రా బుల్లక్ వంతు వచ్చింది. ఆమె తనకు స్కర్ సంపాదించిపెట్టిన బ్సైండ్ సైడ్ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నప్పుడు ఆమె భర్త మరో మోడల్ తో అక్రమసంబంధం ఏర్పరచుకోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో ఆస్కార్ అవార్డు నాయికలపాలిట శాపంగా పరిణమించిందని అందరూ చర్చించుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu