»   » ఈ హారర్ సినిమా ఒంటరిగా చూడకండి..చూస్తే ఖచ్చితంగా 'చస్తారు'..!!

ఈ హారర్ సినిమా ఒంటరిగా చూడకండి..చూస్తే ఖచ్చితంగా 'చస్తారు'..!!

Subscribe to Filmibeat Telugu

అమెరికాలో 2009వ సంవత్సరం అక్టోబరు 16న విడుదలయిన హారర్ మూవీ 'పారానార్మల్ ఆక్టివిటి' (Paranormal Activity) అన్యూహ్యరీతిలో కలెక్షన్లు రాబట్టి సంచలన విజయం సాధించిన సినిమా. కేవలం ఓ వీడియో క్యామ్ సాయంతో ఓరెన్ పెలీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అయిన బడ్జెట్ కేవలం 12 వేల అమెరికన్ డాలర్లు. అంటే సుమారు 6 లక్షలు మాత్రమే. కానీ ఈ సినిమా ఒక్క అమెరికాలో సాధించిన వసూళ్లు 100 మిలియన్ డాలర్లు. అంతటి ఘనవిజయం సాధించిన ఈ హారర్ సినిమాను ఒంటరిగా చూడకపోవడం ఉత్తమం అని టైటిల్ వేసి, 17 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో మాత్రమే చూడాలి అనే నిబంధనతో విడుదల చేసారు.

ఇటీవల ఈ సినిమా మీద ఇటలీలోని పిల్లల తల్లిదండ్రులు, ప్రభుత్వం గుర్రుగా వుంది. ఈ సినిమాను బ్యాన్ చెయ్యాలని కూడా యోచిస్తోంది. దీనికి కారణం ఈ సినిమాను చూసిన పిల్లలు మీద ఈ సినిమా విపరీత ప్రభావం చూపించడమే. ఇటీవల ఈ సినిమా చూసిన 10 ఏళ్ల అమ్మాయి థియేటర్లనే కుప్పకూలిపోవడం, అది ఆమె ప్రాణాల మీదకు రావడం జరిగింది. శ్వాశతీసుకోవడానికి కూడా ఆ అమ్మాయి భయపడుతుండటంతో ప్రస్తుతం కృత్రిమంగా గాలిని అందిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రెండు మూడు జరగడంతో ఈ సినిమాను బ్యాన్ చెయ్యాలని చూస్తున్నారు.

మనలోమన మాట హారర్ చిత్రాలంటే ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన సినిమా ఇది. థియేటర్లో చూస్తే వచ్చే ఫీల్ టివీల్లో రాకపోయినా, మనకా సదుపాయం లేదు కాబట్టి కనీసం టివీలో అయినా తప్పకుండా చూడాల్సిన సినిమా..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu