»   » ప్రేక్షకులని హడలెత్తించనున్న 3డి సినిమా

ప్రేక్షకులని హడలెత్తించనున్న 3డి సినిమా

Subscribe to Filmibeat Telugu

గతంలో విడుదలయిన సైంటిఫిక్ హారర్ మూవీ రెసిడెంట్ ఈవిల్ అపూర్వ ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విభాగంలో ఇప్పటి వరకూ మూడు సినిమాలు రాగా ప్రతి సినిమా ఘనవిజయాన్ని సాధించింది. దీంతో ఇప్పుడా సినిమాకు సీక్వెల్ లో భాగంగా నాల్గవ సినిమా తెరకెక్కుతోంది. ఇంతకు ముందు మూడు సినిమాలకూ దర్శకత్వం వహించిన పాల్ WS ఆండ్రిసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, అతని భార్య గత సినిమాల్లో నాయికగా నటించిన మిల్లా జొవోవిచ్ ఈ సినిమాలో కూడా ప్రధానపాత్రను పోషిస్తోంది.

గత సినిమాల మాదిరిగానే మిమ్మల్ని భయపెట్టనున్న ఈ చిత్రాన్ని 3డిలో రూపొందించి విడుదల చేస్తుండటం విశేషం. ఇంతకు ముందు 3డిలో విడుదలయిన అవతార్, అలైస్ ఇన్ వండర్ ల్యాండ్, క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ సినిమాలు ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాను కూడా 3డిలో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా సెప్టెంబరు 10వ తేదీన విడుదల కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu