»   » నమ్మిన బంటే ప్రాణాలు తీయడంతో క్షోభిస్తోన్న మైఖేల్ ఆత్మ..!!

నమ్మిన బంటే ప్రాణాలు తీయడంతో క్షోభిస్తోన్న మైఖేల్ ఆత్మ..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

"డా.ముర్రే చాలా మంచి వాడు. అతన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నా ప్రాణాలు తీసుకెళ్లి అతని చేతిలో పెడుతున్నాను. అతను ఖచ్చితంగా నా ప్రాణాలను కాపాడటమే కాకుండా నన్ను నవయవ్వనంగా తయారుచెయ్యగలడనే నమ్మకం వుంది." ఇవి తిరుగులేని పాప్ రారాజు, దివంగత మైఖేల్ జాక్సన్ తను మరణించడానికి కొన్ని రోజుల ముందు అతని ప్రాణాలు తీసాడనే అభియోగాన్ని మోస్తున్న డా.ముర్రే గురించి చేసిన వ్యాఖ్యలు.

కానీ ఇప్పటి వరకూ అందిన దర్యాప్తు నివేదిక ప్రకారం డా.ముర్రేనే మైఖేల్ కు మోతాదుకు మించి ప్రొపొఫోల్ అనే మాదక ద్రవ్యాన్ని అందించి అతని ప్రాణాలను హరించాడు. ఎంతగానో నమ్మిన తన పేషెంట్ ప్రాణాలు హరించాడు. తనెంతగానో నమ్మిన డాక్టర్ తన ప్రాణాలు హరించడంతో ఖచ్చితంగా మైఖేల్ జాక్సన్ ఆత్మ క్షోభిస్తోంటుందని అతని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా మైఖేల్ తండ్రి జియో జాక్సన్ మైఖేల్ జాక్సన్ ది ముమ్మాటికీ హత్యే అని, దయచేసి నా కుమారుడికి న్యాయం చెయ్యండని అభ్యర్థిస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu