twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2024 యూఎస్ ఎన్నికల బరిలోకి కాన్యే వెస్ట్.. ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేసిన ఎలాన్ మస్క్.. అసలేం జరిగిందంటే?

    |

    అమెరికాలో పాపులర్ ర్యాపర్ కాన్యే వెస్ట్ అలియాస్ యే మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే పలు వ్యక్తిగత విషయాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న కాన్యే వెస్ట్‌కు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ షాకిచ్చాడు. నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో కాన్యే వెస్ట్ ట్విట్టర్ అకౌంట్‌ను తొలగించారు. 2024 అధ్యక్ష బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్న కాన్యే వెస్ట్‌కు ఇది భారీ దెబ్బే అని అభిమానులు, సన్నిహితులు పేర్కొంటున్నారు. కాన్యే వెస్ట్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..

    భార్యతో విడాకులు సిద్దమైన కాన్యే వెస్ట్

    భార్యతో విడాకులు సిద్దమైన కాన్యే వెస్ట్

    కాన్యే వెస్ట్ ఎనిమిదేళ్ల దాంపత్య జీవితం ముగింపు దశకు చేరుకొన్నది. హాలీవుడ్ నటి కర్దాషియాన్‌తో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కాన్యే వెస్ట్, కర్దాషియాన్ లాయర్లు ఇప్పటికే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు బయట సెటిల్ చేసుకొనేందుకు కిమ్ కర్దాషియన్, కాన్యే వెస్ట్ సిద్దమయ్యాయు. పిల్లల పోషణ కోసం 200000 డాలర్లను నెలకు ఇచ్చేందుకు భార్యతో కాన్యే వెస్ట్ ఒప్పందం చేసుకొన్నారు. డిసెంబర్ నెలలో వారిద్దరికి విడాకులు లభించే అవకాశం ఉంది.

     యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ

    యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ


    ఇదిలా ఉండగా, 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాన్యె వెస్ట్ రెడీ అవుతున్నాడు. తాను బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నానని ఇటీవల ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ఈ మేరకు ఫ్లోరిడాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా సమావేశమైన్టు చెప్పారు. డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడేందుకు రెడీగా ఉన్నాను అంటూ చెప్పారు. ఇలాంటి సంఘటనల మధ్య కాన్యే వెస్ట్‌కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది.

    నా ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్

    నా ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్


    తన ట్విట్టర్ అకౌంట్ సస్పెన్షన్‌కు గురైందని స్వయంగా కాన్యే వెస్ట్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ఏర్ాపటు చేసిన ట్రూత్ ఫ్లాట్‌ఫామ్‌లోని తన అకౌంట్‌లో ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేసినట్టు వచ్చిన మెసేజ్‌ను స్క్రీన్ షాట్‌గా పెట్టారు. అయితే తన అకౌంట్‌ను వెంటనే పునరుద్దరించాలని కాన్యే వెస్ట్ చేసిన రిక్వెస్ట్‌కు ట్విట్టర్ స్పందించకపోవడం గమనార్హం.

     అడాల్ఫ్ హిట్లర్‌పై ప్రశంసలా?

    అడాల్ఫ్ హిట్లర్‌పై ప్రశంసలా?


    అమెరికాలో హింసను ప్రేరేపించే విధంగా కాన్యే వెస్ట్ పోస్ట్ పెట్టారు. రెండు రోజుల క్రితం నాజీ డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు అనే ఆరోపణలపై ట్విట్టర్ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. స్టార్ ఆఫ్ డేవిడ్‌లో స్వస్థిక్ సింబల్‌ను పోస్ట్ చేశారు. గతంలో కూడా ఇలా నిబంధనలు ఉల్లంఘించాడు. అందుకే కాన్యే వెస్ట్ ట్విట్టర్ అకౌంట్‌ను సస్పెండ్ చేశాం. తరఫున ఏం చేయాలో అది చేశాను. ఇక నా చేతిలో ఏమీ లేదు అని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ చెప్పారు.

     ఎలాన్ మస్క్ దూకుడు..

    ఎలాన్ మస్క్ దూకుడు..


    ఇదిలా ఉండగా, ట్విట్టర్ సంస్థను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత భారీగా ఆంక్షలు విధిస్తున్నారు. ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌ను కూడా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత పలు రిక్వెస్టులను పరిశీలించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ అకౌంట్‌ను తిరిగి పునరుద్ధించింది.

    English summary
    Kanye West Twitter Account suspended for praising Adolf Hitler in a recent meeting. Twitter owner Elon Musk says that, The rapper violated the Twitter platform's rules prohibiting incitement to violence.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X