»   » సినిమా షూటింగ్ మీద ముస్లిం ఆందోళనకారుల దాడి

సినిమా షూటింగ్ మీద ముస్లిం ఆందోళనకారుల దాడి

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ నాయిక, టామ్ క్రూజ్ జీవిత భాగస్వామి క్యాటీ హాల్మస్ తాజాగా నటిస్తున్న చిత్రం సన్ ఆఫ్ నో వన్(Son of No One). ఇటీవల ఈ సినిమా షూటింగ్ న్యూయార్క్ లో జరుగుతుందగా కొంత మంది ముస్లిం ఆందోళనకారులు షూటింగును ఆపేందుకు ప్రయత్నించారు. వెంటనే ఈ సినిమా షూటింగు ఆపేయాలని నిరసన ప్రదర్శనలు చేసారు.

ఈ వివాదానికి కారణం ఈ సినిమాలో ఓ చోట ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ను అవమానించేలా వుందని ముస్లింలు భావించడమే. ఈ ఘటనతో ఖంగుతిన్న నిర్మాత వెంటనే వారికి క్షమాపనలు చెప్పి ఆ సన్నివేసంలో కావాలని ఖురాన్ ను అవమానించేలా చిత్రీకరించలేదని చెప్పాడట. అంతే కాదు అవసరమయితే ఈ సన్నివేశాన్ని తొలగిస్తానని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. ఇలాంటి ఆందోళనలు టాలీవుడ్ కు కూడా కొత్తేం కాదు. ఇటీవల విడుదలయిన అదుర్స్ సినిమాలో ఓ పాట బ్రాహ్మనులను కించపరిచేలా వుందని లిరిక్స్ మార్చిన సంగతి తెలిసిందే. అయితేనేం ఈ సినిమా ఘనవిజయం సాధించడానికి ఈ వివాదాలు బాగా సహకరించాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu