»   » మైఖేల్ జాక్సేన్ కూతురు మూవీ, బాలీవుడ్‌తో లింకు...

మైఖేల్ జాక్సేన్ కూతురు మూవీ, బాలీవుడ్‌తో లింకు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: దివంగత పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ పారిస్ జాక్సన్ నటిస్తున్న ఓ అమెరికన్ చిత్రం ఇపుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం బాలీవుడ్ మ్యూజికల్ ఇన్స్‌స్పిరేషన్ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ రీచా చద్దా, పాకిస్థాన్ యాక్టర్ అలీ పాజల్ కూడా నటిస్తున్నట్లు సమాచారం.

రెండు హిందీ సాంగులు

రెండు హిందీ సాంగులు

ఇటీవలే వీరంతా లాస్ ఏంజల్స్ లో కలిసి ప్రాజెక్టు గురించి చర్చించారని తెలుస్తోంది. ఇంగ్లీష్ భాషలో తెరకెక్కుతున్న ఈ అమెరికన్ మూవీలో 2 హిందీ సాంగులు కూడా ఉంటాయని సమాచారం. ఈ నెల చివర్లో ఈ సినిమా ప్రారంభం కాబోతోంది, ఫస్ట్ లుక్ కూడా అప్పుడే రిలీజ్ అవుతుందని సమాచారం.

పారిస్ జాక్సన్

పారిస్ జాక్సన్

పారిస్ జాక్సన్ విషయానికొస్తే...ఆమె మైఖేల్ జాక్సన్ ఒక్కగానొక్క కూతురు. నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. వివిధ టీవీ కార్యక్రమాల్లో నటిస్తోంది. హాలీవుడ్లో నటిగా రాణించాలనే లక్ష్యంతో పారిస్ జాక్సన్ ముందుకు సాగుతోంది.

ఎఫైర్లు

ఎఫైర్లు

ఆ మద్య పారిస్ మీదన రకరకాల వార్తులు వచ్చాయ. బాయ్ ఫ్రెండ్‌ చెస్టర్ కాస్టెల్లాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని, చెస్టర్ వల్ల పారిస్ జాక్సన్ గర్భవతి అయినట్లు గతేడాది వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రూమర్స్

రూమర్స్

‘పారిస్ జాక్సన్ తన బాయ్ ఫ్రెండుతో కలిసి డేట్ కి వెళ్లినపుడు తాము చూసామని, ఆమె బేబీ బంప్ చూస్తుంటే గర్భవతి అయినట్లు స్పష్టమవుతోందని పలువురు వ్యఖ్యానించినట్లు డైలీ స్టార్ తన కథనంలో పేర్కొంది. అయితే అవన్నీ కేవలం రూమర్స్ అని తర్వాత తేలిపోయింది.

English summary
Late pop legend Michael Jackson's 18-year-old daughter, Paris Jackson is reportedly in talks to star in a film inspired by Bollywood musicals.As per media reports, the film will also have Bollywood actress Richa Chadda and Pakistani actor Ali Fazal, who has acted in a few Hindi films.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu