»   » మైఖేల్ జాక్సన్ హత్య కేసు..పోలీసులకు లొంగిపోనున్న డా.ముర్రే..!!

మైఖేల్ జాక్సన్ హత్య కేసు..పోలీసులకు లొంగిపోనున్న డా.ముర్రే..!!

Subscribe to Filmibeat Telugu

దివంగత పాప్ దృవతార మైఖేల్ జాక్సన్ మరణం సహజమైనది కాదని, ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన హత్య అని ఇటీవల విడుదలయిన పోస్ట్ మార్టం రిపోర్ట్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మైఖేల్ మరణానికి కొన్ని గంటల ముందు ఆయన వ్యక్తిగత ఫిజీషియన్ ముర్రే అతనికి ఉద్దేశ్యపూర్వకంగా అధిక మోతాదులో ప్రొపొఫోల్ అనే మాదకద్రవ్యాన్ని ఇవ్వడం వల్లే ఆయన మరణించాడని పోస్ట్ మార్టం నివేదిక అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసుపై విచారణ చేపట్టిన దర్యాప్తు బృందం ఓ నివేదికను తయారుచేసి కోర్టు అప్పగించిందట. ఈ నివేదిక ప్రకారం డా.ముర్రేకు తప్పకుండా శిక్షపడే అవకాశాలు వున్నాయని సమాచారం.

ఈ విషయమై స్పందించిన ముర్రే తరపు న్యాయవాది ముర్రే లాస్ ఏంజిల్స్ లో వున్నాడని, అవసరం అయితే లొంగిపోవడానికి సిద్ధంగా వున్నాడని తెలిపారు. మరి ముర్రేకు శిక్షపడే అవకాశం వుందా అన్న ప్రశ్నకు తనవద్ద దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని తెలిపాడు. ఇదిలా వుంటే మైఖేల్ జాక్సన్ సోదరి జానెట్ జాక్సన్ తన సొదరుడి మృతికి ముర్రేనే కారకుడని, అతన్ని కఠినంగా శిక్షించాలని ఓ ప్రయివేట్ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ చెప్పింది. కాగా ఈ వారాంతంలో కానీ, వచ్చే వారం ప్రథమార్థంలో కానీ ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువడనుందని తెలిసింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu