»   » చస్తే చచ్చాడు..జరిగిపోయిన విషయాలు నేను ఆలోచించను..!!

చస్తే చచ్చాడు..జరిగిపోయిన విషయాలు నేను ఆలోచించను..!!

Subscribe to Filmibeat Telugu

దివంగత పార్ సింగర్ మైఖేల్ జాక్సన్ ను ఉద్దేశ్యపూర్వకంగా అధిక మోతాదులో మాదకద్రవ్యాలు ఇచ్చి హతమార్చాడనే ఆరోపణనలు ఎదుర్కొంటున్న ఆయన వ్యక్తిగత వైద్యుడు ముర్రే మైఖేల్ జాక్సన్ మరణించడంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనేమీ నేరం చెయ్యలేదని అంటున్నాడు. అసలు ఆయన మరణించడం హఠాత్తుగా జరిగింది, అందులో నా నేరం ఏముంది, అసలు మైఖేల్ మరణించడం పెద్దగా ఆలోచించాల్సిన సంఘటన కాదు, జరిగిపోయినదాని గురించి ఆలోచించడం తనకు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించాడు.

మైఖేల్ జాక్సన్ ను హత్య చేసాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముర్రేకు కోర్టు 75 వేల డాలర్ల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అతను డాక్టర్ కనుక ప్రాక్టీసు చెయ్యవచ్చని అతనికి అనుమతిని ఇచ్చింది. కానీ కొన్ని ఔషదాలను రోగులకు సూచించరాదని, అందులోనూ ముఖ్యంగా ప్రొపొఫోల్ ను రోగికి సూచించే హక్కు కూడా అతనికి వుండదని కోర్టు హుకుం జారీచేసింది. ఈ కేసు తదుపరి వాదన ఏప్రిల్ 5న జరుగనుంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu