»   » హాలీవుడ్ సినిమాకు రెహ్మాన్ డైరెక్షన్.. సినిమా గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

హాలీవుడ్ సినిమాకు రెహ్మాన్ డైరెక్షన్.. సినిమా గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హమ్మ హమ్మ, మా తుజే సలాం, జైహో లాంటి పాటలతో సంగీతాభిమానులను ఆకట్టుకొన్న మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రహ్మాన్ దర్శకుడిగా మారారు. తొలిసారి దర్శకత్వం బాధ్యతలు చేపట్టి రూపొందిస్తున్న వర్చువల్ రియాల్టీ సినిమా లే మస్క్ చిత్రానికి తుది మెరుగులు దిద్దుతుండగానే ఆయనకు మరో హాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడం గమనార్హం. అది కూడా వర్చువల్ రియాల్టీలో రూపొందించే సినిమా కావడం విశేషం. హాలీవుడ్ సినిమా ఆఫర్ గురించి చెప్తూ..

హాలీవుడ్ ఆఫర్ నిజమే..

హాలీవుడ్ ఆఫర్ నిజమే..

హాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది నిజమే. అదికూడా వర్చువల్ రియాల్టీ మూవీ. కానీ లే మస్క్ సినిమా పూర్తయిన తర్వాత దానిని టేకప్ చేస్తాను. ఆ చిత్రం భారతీయ సంప్రదాయ నృత్యరీతుల నేపథ్యంగా తీస్తాను. ఈ ఆఫర్ రావడం చాలా ఆనందంగా ఉంది. దర్శకత్వం వహించాలన్న కోరికకు మరింత చేయూత దొరికింది అని రెహ్మాన్ అన్నారు.

లే మస్క్ కంటే..

లే మస్క్ కంటే..

ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్‌పై రూపొందించే సినిమా ‘లే మస్క్' కంటే చాలా ఆసక్తిగా ఉంటుంది. ఐదు విభిన్నమైన భారతీయ సంప్రదాయ నృత్య రూపాలు, సంగీతం, ఇతర అంశాల ఆధారంగా కథ రూపొందుతున్నది. వచ్చే ఏడాది హాలీవుడ్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది అని రెహ్మాన్ చెప్పారు.

వర్చువల్ రియాల్టీ అంటే..

వర్చువల్ రియాల్టీ అంటే..

దర్శకత్వం చేపట్టడమంటే చాలా ఇష్టం. ప్రస్తుత సాంకేతిక అంశం వర్చువల్ రియాల్టీ అంటే నాకు ఇంకా ఇష్టం. అలాంటి టెక్నాలజీని ఆధారంగా చేసుకొని సినిమా నిర్మించడమే నా లక్ష్యం అని రెహ్మాన్ అన్నారు. నటీనటుల వివరాలను, సాంకేతిక నిపుణుల సమాచారాన్ని వెల్లడించడానికి రెహ్మాన్ నిరాకరించారు. త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాను అని ఆయన చెప్పారు.

వీఆర్ అంటే ఇది..

వీఆర్ అంటే ఇది..

మనకు కనిపించే వాస్తవ దృశ్యాలను అలానే ఊహకందని విధంగా, కొత్త అనుభూతికి గురిచేసే విధంగా చూపించడమే వర్చువల్ రియాల్టీ. తెరమీద దృశ్యాలు నిజంగా కళ్ల ముందు కదలాడినట్టు అనిపిస్తాయి. సినిమాలో ప్రేక్షకుడిని కూడా భాగం చేయడం ఈ టెక్నాలజీ అదనపు బలం. ఇండియాలో వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ పీవీఆర్ సినిమా హాళ్లలో ఉంది. ఈ హాళ్లలోనే లే మస్క్ టీజర్‌ను రెహ్మాన్ ఇటీవల ఆవిష్కరించారు.

అద్భుతంగా లే మస్క్..

రెహ్మాన్ తొలిసారి దర్శకత్వం చూస్తున్న లే మస్క్ చిత్ర దృశ్యాలు టీజర్‌లో అద్భుతంగా ఉన్నాయి. దృశ్యాల చిత్రీకరణ, వాటికి తోడు సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం నిడివి 55 నిమిషాలు. ఈ ఏడాది చివరన ఈ వర్చువల్ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లీ మస్క్ టీజర్‌‌ ఎలాం ఉందో మీరు చూడండి.

English summary
Composer and singer AR Rahman, who is currently working on his debut virtual reality film, plans to make another film, which will explore Indian classical dance forms. The music maestro would rather concentrate on virtual reality format, and is currently busy with his debut directorial, Le Musk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu