»   » వివాదాల రాణి ఇప్పుడు బిజీబిజీ..!!

వివాదాల రాణి ఇప్పుడు బిజీబిజీ..!!

Subscribe to Filmibeat Telugu

ఇన్నాళ్లు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచిన పాప్ తార బ్రిట్నీ స్పియర్స్ ఇప్పుడు కొత్త ఆల్బమ్ రూపొందించడంలో బిజీబిజీగా వుంది. గత కొన్నాళ్లుగా మానసికంగా చాలా కృంగిపోయిన బ్రిట్నీ పాప్ సంగీతానికి దూరంగా వుంటూ వస్తోంది. కానీ తాజా సమాచారం ఏంటంటే ఆమె ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఓ ఆల్బమ్ ను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తోందట. దీనికోసం ఆమె భారీగా కసరత్తులు మొదలెట్టిందట. ఇటీవలే విడుదలయిన ఓ వాణిజ్య ప్రకటనలో మునుపటి గ్లామర్ తో మెరిసిపోతున్న బ్రిట్నీ ఆల్బమ్ గురించి ఆమె అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే బ్రిట్నీ ది ఉమనైజర్ ఆల్బమ్ కు సాహిత్యం అందించిన అవుట్ సైండర్స్ తో, బ్లాక్ అవుట్ ఆల్బమ్ కు సాహిత్యం అందించిన ఎల్లిస్ తో సంప్రదింపులు జరుపుతోందట. వచ్చే జూన్ మాసానికల్లా కొత్త ఆల్బమ్ తో తన అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతోంది బ్రిట్నీ..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu