»   » మీడియా ముందుకొస్తున్న 14 మందితో తిరిగిన తిరుగుబోతు..!!

మీడియా ముందుకొస్తున్న 14 మందితో తిరిగిన తిరుగుబోతు..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ ఆటతో ఎంత పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడో, అడ్డదార్లు తొక్కి అంతే అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. పక్కదార్లు పట్టి ఎంతో మంది అమ్మాయిలతో తిరిగి చెడ్డపేరు తెచ్చుకోవడమే కాకుండా తన భార్య చేతిలో మూతి పచ్చడి చేయించుకున్నాడు. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. టైగర్ వుడ్స్ గత రెండు మాసాల వ్యవధిలో 14 మంది అతివలతో శృంగార సంబంధాలు నెరిపాడని సమాచారం. అతని ప్రియురాళ్లలో ఓ వెయిట్రెస్, ఓ బూతు సినిమాల నాయిక కూడా వుంది. వుడ్స్ తో తాము పడకపంచుకున్నామని వీరంతా మీడియాకు ఎక్కడంతో ఈ వార్త బయటపడింది. దీంతో అతని భార్య అతనికి విడాకులు ఇవ్వడానికి కోర్టుకు ఎక్కింది. అతడు కాళ్లావేల్లా పడినా ఆమె కనికరించలేదు. దీంతో అతడు ఇంక గోల్ఫ్ క్రీడను ఆడనని కూడా ప్రకటించాడు.

ఈ ఆరోపనలు వెల్లువెత్తినప్పటి నుండీ వుడ్స్ మీడియాకు దూరంగా వుంటూ వస్తున్నాడు. కానీ తొలి సారిగా ఈ రోజు(శుక్రవారం) ఆయన మీడియా ముందు పెదవి విప్పనున్నాడు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలో వెద్రా బీచ్‌‌లో ఉన్న టీపీసీ సాగ్రాస్ క్లబ్‌హౌస్‌లో ఉదయం 11 గంటలకు మీడియాతో వుడ్ మాట్లాడుతాడని ఆయన తరపు ఏజెంట్ తెలిపారు. దీనిపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతమంది స్నేహితులు, సహచరులు, దగ్గరి బంధువులతో మాట్లాడుతారని చెప్పారు. అలాగే తన భవిష్యత్‌తో పాటు.. ఇటీవలి కాలంలో తన ప్రవర్తనపై కూడా క్షమాపణలు చెప్పాలని భావిస్తున్నారని ఏజెంట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారాన్నింటిపై వుడ్ త్వరలోనే బహిరంగ ప్రకటన చేస్తారని వుడ్స్ ఏజెంట్ మార్క్ స్టైన్‌బర్గ్ తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu