»   » మానవాళికి, ఆస్‌గర్డ్‌ వాసులకి మధ్య 'మహాశక్తివంతుడు'..

మానవాళికి, ఆస్‌గర్డ్‌ వాసులకి మధ్య 'మహాశక్తివంతుడు'..

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రిస్ హేమ్స్‌ వర్త్, నటాలీ పోర్ట్‌ మాన్ హీరో, హీరోయిన్స్ గా కెన్నత్ బ్రానాగ్ దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్ చిత్రం 'తోర్". పారామౌంట్ పిక్చర్స్, మార్వల్ ఎంటర్‌ టైన్‌ మెంట్ సంయుక్తంగా నిర్మించిన యాక్షన్, ఎడ్వంచరస్ మరియు ఫాంటసీ థ్రిల్లర్ ఇది. ఈ నెల 29న తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. హన్సా పిక్చర్స్ 'మహాశక్తివంతుడు తోర్" పేరిట తెలుగు వెర్షన్‌ని విడుదల చేస్తోంది.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిథి మాట్లాడుతూ -'మానవాళికి, ఆస్‌ గర్డ్‌ వాసులకి మధ్య సాగే కథ ఇది. భూమండలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించే కొంతమంది ఆస్‌ గర్డ్‌ వాసులను తోర్ అనే శక్తివంతుడు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. అత్యాధునిక సాంకేతిక విలువలతో, అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది" అన్నారు.

English summary
The day’s light was fading, but the cast and crew of “Thor” were making good headway on a battle scene a giant, fire-breathing alien automaton was laying waste to a tiny desert town. Still, director Kenneth Branagh kept glancing at the horizon with anxious Irish eyes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu