»   » భార్యతో మూతిపగలగొట్టించుకున్న సెలబ్రిటీ పతనం సినిమాగా..!!

భార్యతో మూతిపగలగొట్టించుకున్న సెలబ్రిటీ పతనం సినిమాగా..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ ఆటతో ఎంత పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడో, అడ్డదార్లు తొక్కి అంతే అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. పక్కదార్లు పట్టి ఎంతో మంది అమ్మాయిలతో తిరిగి చెడ్డపేరు తెచ్చుకోవడమే కాకుండా తన భార్య చేతిలో మూతి పచ్చడి చేయించుకున్నాడు. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. దీంతో ఈ వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని ఓ టెలీఫిలిం రూపొందించే నిర్మాత ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. దీనికి ఇప్పటికే టైగర్ ఉడ్స్ పోలికలు వున్న నటుడు క్యూబా గూడింగ్ ను సిద్ధం చేసుకున్నాడట.

టైగర్ వుడ్స్ గత రెండు మాసాల వ్యవధిలో 14 మంది అతివలతో శృంగార సంబంధాలు నెరిపాడని సమాచారం. అతని ప్రియురాళ్లలో ఓ వెయిట్రెస్, ఓ బూతు సినిమాల నాయిక కూడా వుంది. వుడ్స్ తో తాము పడకపంచుకున్నామని వీరంతా మీడియాకు ఎక్కడంతో ఈ వార్త బయటపడింది. దీంతో అతని భార్య అతనికి విడాకులు ఇవ్వడానికి కోర్టుకు ఎక్కింది. అతడు కాళ్లావేల్లా పడినా ఆమె కనికరించలేదు. దీంతో అతడు ఇంక గోల్ఫ్ క్రీడను ఆడనని కూడా ప్రకటించాడు.."గొప్పవాళ్ల కీర్తి కిరీటాలు, భుజకీర్తులు రాలిపడుతుంటే జనం ఆనందంగా చూస్తారు. అలాగే టైగర్ వుడ్స్ పతనాన్ని కూడా జనం ఆదరిస్తారని" ఓ సినీ విమర్శకుడు వ్యాఖ్యానించాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu