»   » నిజాలు చెప్పినందుకు పులిరాజా వారికి కోపమొచ్చింది..!!

నిజాలు చెప్పినందుకు పులిరాజా వారికి కోపమొచ్చింది..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మూగజీవాల సంరక్షణాత్మం ఏర్పడిన పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్ (PETA) మీద పులిరాజా అలియాస్ టైగర్ వుడ్స్ కు కోపమొచ్చింది. ఎంతగా అంటే కోర్టుకు లాగుతానని హెచ్చరించేంతగా. మరి అంతగా కోపం రావడానికి కారణం ఆయన చేసిన నిర్వాకాన్ని(18 మందితో అక్రమసంబంధం నెరపడం) మంచి కోసం ఉపయోగించుకోవడమే. "అతి కామం అనర్థం" (Too much sex can be a bad thing) అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్న PETA అందుకు టైగర్ వుడ్స్ సరియైన వ్యక్తిగా భావించి ఆయన చిత్రం మీద ఈ స్లోగన్ రాసి ప్రచారం చెయ్యాలనుకున్నారట.

ఈ వార్త తెలిసిన టైగర్ వుడ్స్ కు పుండు మీద కారం చల్లినట్టు అయింది. ఇటీవలే తను చేసిన తప్పులకు మీడియా క్షమాపన అడిగి చచ్చిన పాములాగా వున్న ఆయన్ను ఈ వార్త కలచివేసింది. అంతే వెంటనే తన లాయర్ కు కబురు చేసి PETA కు హెచ్చరికలు జారీచేసాడు. ఇక చేసేది లేక PETA బృందం ఈ ప్రకటన కోసం మరో ముఖాన్ని వెతికే పనిలో వున్నారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu