»   » నాలుగవ సీక్వెల్ కు సిద్ధమవుతున్న సూపర్ హిట్ మూవీ..!!

నాలుగవ సీక్వెల్ కు సిద్ధమవుతున్న సూపర్ హిట్ మూవీ..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీక్వెల్ లు తీసే సాంప్రదాయానికి నాంది పలికిన హాలీవుడ్ లో సినిమా హిట్ అయితే వెంటనే సీక్వెల్ రూపొందుతుంది. అదే సినిమా సూపర్ హిట్ అయితే నాలుగయిదు సీక్వెలు రూపొందుతాయి. తాజాగా ఇదే కోవలోకి వస్తుంది టామ్ క్రూజ్ కు స్టార్ ఇమేజి తెచ్చిపెట్టిన సినిమా మిషన్ ఇంపాజబుల్. ఇప్పటికే ఈ సినిమాకు మూడు సీక్వెల్లు రాగా మూడూ ఘనవిజయాన్ని సాధించాయి.

తాజాగా ఈ సినిమాకు నాల్గవ భాగం రూపుదిద్దుకుంటోంది. 2011వ సంవత్సరంలో విడుదల అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు మిషన్ ఇంపాజబుల్-lll సినిమాకు దర్శకత్వం వహించిన జెజె అబ్రమ్స్, పారామౌంట్ ప్రొడక్షన్స్ తో కలసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు వచ్చిన మూడు భాగాలకన్నా ఈ సినిమా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో రూపొందనుందని అబ్రమ్స్ వెళ్లడించారు. ఈ వార్త ఖచ్చితంగా యాక్షన్ సినిమాలంటే ఇష్టపడే వారికి శుభవార్తే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu