twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రానా ఎప్పుడెప్పుడన్నాడు.. అందుకే ఓకే అన్నాను.. తాప్సీ పొన్ను

    |

    గ్లామర్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి వచ్చిన తాప్సీ పొన్ను రూటు మార్చింది. తాజాగా సోలో హీరోయిన్‌గా అవతారం ఎత్తి విజయాలను అందుకొన్నది. నామ్ షాబానా, సూర్మా, పింక్, బద్లా సినిమాలు ఆమెను అగ్రతారగా నిలబెట్టాయి. తాజాగా తాప్సీ పొన్ను నటించిన గేమ్ ఓవర్ సినిమా జూన్ 14న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ.. తన సినిమా విషయాలు, సినిమాలో కీలక పాయింట్ల వెల్లడించారు. తాప్సీ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

     ఏడాదిన్నర క్రితం

    ఏడాదిన్నర క్రితం

    గేమ్ ఓవర్ స్క్రిప్టు ఏడాదిన్నర క్రితం డైరెక్టర్ శశి నా దృష్టికి తెచ్చారు. ఈ స్క్రిప్టు బాగుంది. మీరు ఓసారి చదవండి. మీకు నచ్చితే తెలుగు, తమిళంలో రూపొందిస్తామని చెప్పారు. నా సినిమా పింక్ గురించి గంటసేపు ఫొన్‌లో మాట్లాడారు. ఓ సౌత్ దర్శకుడు బాలీవుడ్ సినిమా గురించి గొప్పగా చెప్పడం చాలా అరుదు. దాంతో శశి ఇచ్చిన స్క్రిప్టును చదివాను. వెంటనే ఓకే చెప్పాను. 100 శాతం సినిమా చేస్తానని హామి ఇచ్చాను. ఈ సినిమాలో వీడియో గేమ్ డెవలపర్‌గా నటిస్తున్నాను.

     దర్శకుడు శశి చాలా ఎక్సైటింగ్‌గా

    దర్శకుడు శశి చాలా ఎక్సైటింగ్‌గా

    దర్శకుడు శశి రాసిన స్క్రిప్టు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఈ సినిమా స్క్రిన్ ప్లై, నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇండియాలోనే ఇలాంటి కథ రాలేదు. ఈ సినిమాను రిలయెన్స్ వాళ్లు చూసి భారతీయ అన్ని భాషల్లో రూపొందించాలన్నారు. అలాగే దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమా చూసి గొప్పగా ఉందన్నారు. భారతీయ భాషల్లోనే కాకుండా విదేశీ ప్రేక్షకులకు చేరేలా చేస్తానని ఆయన చెప్పారు.

     గేమ్ ఓవర్‌లో 25 రోజులపాటు

    గేమ్ ఓవర్‌లో 25 రోజులపాటు

    గేమ్ ఓవర్ సినిమా ఓ ప్రాంతీయ సినిమా కాదు. ఈ సినిమాకు ఉన్న ప్రాముఖ్యతతో హిందీలో డబ్ చేస్తున్నాం. ఈ సినిమా నాకు స్ట్రెయిట్ తెలుగు, తమిళ సినిమా. ఈ సినిమా నాకు షూటింగ్ చేసేటప్పుడు శారీరకంగా, మానసికంగా కష్టపడ్డాను. ఇంత వరకు నాకు చిన్న గాయం కూడా కాలేదు. అలాంటింది నేను రెండు కాళ్లు పనిచేయని యువతి క్యారెక్టర్ చేశాను. అందుకోసం రెండు కాళ్లకు బ్యాండేజ్ వేసుకొన్నాను. 25 రోజులు వీల్ చైర్‌లో ఉండి నటించాను. మొత్తం 37 రోజులపాటు సినిమా షూట్ చేశాం.

     నా ద‌ృష్టిలో వాళ్లే హీరోలని

    నా ద‌ృష్టిలో వాళ్లే హీరోలని

    నేను సోలో హీరోయిన్‌గా ఓ సినిమాను మొత్తంగా నా భుజాల మీదుగా ముందుకు తీసుకెళ్లడం చాలా హ్యాపీగా ఉంది. ఆ క్రెడిట్ అంతా నా డైరెక్టర్లదే. నా డైరెక్టర్లందరూ బ్రిల్లియంట్. నా దృష్టిలో వాళ్లే నా హీరోలు. నేను డైరెక్టర్ యాక్టర్. నా దృష్టి అంతా నా డైరెక్టర్ ఎవరు అనే దానిపై ఉంటుంది. హిందీలో పోస్టర్లపై హీరోయిన్ల పేరు వేయరు. కానీ తమిళంలో ‘తాప్సీ ఇన్ గేమ్ ఓవర్' టైటిల్‌ను చూసి భయపడ్డాను. నాపై మరింత బాధ్యతను పెట్టినట్టు భావించాను

     స్క్రిప్టుల విషయంలో మెచ్యురిటీ

    స్క్రిప్టుల విషయంలో మెచ్యురిటీ

    నా కెరీర్ తొలినాళ్లలో స్క్రిప్టులను జడ్జ్ చేయడం నాకు తెలియదు. ఏది వస్తే ముందుకు వస్తే దానిని అంగీకరిస్తూ ఉండేది. కానీ ఇటీవల కాలంలో నా సినిమాల స్క్రిప్టులను జడ్జ్ చేయడం నేర్చుకొన్నాను. స్క్రిప్టు చదివేటప్పుడు చాలా రకాలుగా ఆలోచిస్తుంటాను. రూ.200 పెట్టి ఈ సినిమా చూస్తే.. ఏదైనా బెటర్ ఫీలింగ్ ఉంటుందా? అంతేకాకుండా మూడు గంటలు వెచ్చించి సినిమాకు వస్తే ఎలాంటి అనుభూతి ఈ సినిమా కలిగిస్తుందా? అని ఆలోచిస్తాను. అందుకే నా సినిమాలు అందరికీ నచ్చుతున్నాయి.

     భారతీయ భాషల్లో రానటువంటి సినిమా

    భారతీయ భాషల్లో రానటువంటి సినిమా

    గేమ్ ఓవర్ యూత్‌ను ఆకట్టుకొనే సినిమా. హాలీవుడ్, కోరియా, ఏ ఇతర భాషా చిత్రాల నుంచి స్ఫూర్తి పొందలేదు. ఈ సినిమా ఇండియన్ గానీ, ఇతర భాషల్లో రాని కథ, కాన్సెప్ట్. గేమ్ ఓవర్ సినిమా ట్రైలర్‌ను రానా దగ్గుబాటి రిలీజ్ చేశాడు. ఆ తర్వాత నాకు కాల్ చేసి మాట్లాడాడు. నా హిందీ సినిమాలు రిలీజైతే మెసేజ్ చేస్తాడు. నాతో చాలా బాగా మాట్లాడుతాడు. గేమ్ ఓవర్ సినిమా ఎప్పుడెప్పుడూ చూడాలా అనిపిస్తున్నదని రానా చెప్పాడు.

    English summary
    After Successful movies like Pink, Badla, Tapsee Ponnu is doing Game Over. She is acting as Video Game developer. This movie is set to release on June 14. In this occassion, She speaks to Telugu filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X