twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునీల్‌ పొడిచేస్తాడన్నారు.. కమెడియన్‌గా కమ్ బ్యాక్ అన్నారు.. ఏం జరిగింది.. పృథ్వీ

    |

    కామెడియన్‌గా పృథ్వీ ఓ విలక్షణమైన హాస్యాన్ని పండిస్తాడు. డైలాగ్ డెలివరీతోనే తెరపై నవ్వుల పువ్వులు పూయిస్తాడు. అవకాశం దొరికిందంటే చాలూ తెర మీద చెలరేగిపోవడం పృథ్వీ నైజం. అందుకే అతడిని 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని ముద్దుగా పిలుచుకొంటారు. తాజాగా తెలుగు తెరను మరోసారి నవ్వులతో నింపడానికి పృథ్వీ సిద్దమయ్యాడు. బ్లఫ్ మాస్టర్ చిత్రంలో ధనశెట్టిగా కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఈ సినిమా విశేషాలను పంచుకొంటూ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. పృథ్వీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

     నేను కమెడియన్‌ను కాదు..

    నేను కమెడియన్‌ను కాదు..

    నేను బేసిక్‌గా కమెడియన్‌ను కాదు. నా రూపం హాస్యాన్ని పుట్టించదు. కానీ నేను చెప్పే డైలాగ్స్‌తోనే కామెడీ పండుతుంది. నేను ముఖం మీద కొట్టేసుకొని కామెడీ చేసే నటుడిని కాదు. కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ సూచన మేరకు నటుడిగా మరో స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను.

     కోట శ్రీనివాసరావు సలహా మేరకు

    కోట శ్రీనివాసరావు సలహా మేరకు

    క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోమ్మని కోట శ్రీనివాసరావు చెప్పారు. ఆయన మాదిరిగా నేను కామెడీ, విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించాలని అనుకొంటున్నాను. వినయ విధేయ రామలో చక్కటి క్యారెక్టర్‌లో కనిపిస్తాను. లెజెండ్‌లో జగపతిబాబుకు ఎలాంటి టర్నింగ్ ఇచ్చిందో అలాంటి స్థాయిని కల్పించే పాత్ర అది.

    బ్లఫ్ మాస్టర్ మరో అర్జున్‌రెడ్డి.. రాసుకోండి.. ఖడ్గం.. లౌక్యం సెంటిమెట్ రిపీట్.. పృథ్వీబ్లఫ్ మాస్టర్ మరో అర్జున్‌రెడ్డి.. రాసుకోండి.. ఖడ్గం.. లౌక్యం సెంటిమెట్ రిపీట్.. పృథ్వీ

    ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ నడుస్తుంది

    ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ నడుస్తుంది

    టాలీవుడ్‌లో నా స్థానానికి ఢోకా లేదు. అలా అని ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ నడుస్తుంది. ఒకప్పడు బ్రహ్మానందం.. ఆ తర్వాత సునీల్ టైమ్ నడించింది. నాతోపాటు ఎందరో కమెడియన్లకు మంచి రెస్పాన్స్ ఉంది. కామెడీని వదిలేసి సునీల్ ఏడేళ్లు హీరోగా ట్రై చేశాడు. మళ్లీ ఇప్పుడు కామెడియన్‌గా వస్తున్నాడు. నేను కామెడీని వదిలేయను.

    హీరో సునీల్ కమ్‌బ్యాక్‌పై

    హీరో సునీల్ కమ్‌బ్యాక్‌పై

    కమెడియన్‌గా సునీల్ కమ్ బ్యాక్ అన్నారు. ఇక పొడిచేస్తాడని.. అది చేస్తాడు.. ఇది చేస్తాడని చెప్పారు. కానీ కమెడియన్‌గా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాడు. ఏడేళ్లు హీరోగా చేసిన తర్వాత మళ్లీ కమెడియన్‌గా ప్రేక్షకులు ఒప్పుకొంటారనేది చాలా కష్టమైన పనే అనేది నా అభిప్రాయం.

    ఇక్కడ రాజకీయాలు ఎక్కువే

    ఇక్కడ రాజకీయాలు ఎక్కువే

    నా కెరీర్‌ ఆరంభంలో నేను ఎంత కష్టపడ్డానో ఇప్పుడు అంతే కష్టపడుతున్నాను. తెలుగు సినీ పరిశ్రమలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉండే రాజకీయాలు బయట కూడా ఉండవు. ఒకరికి లేనిపోని విషయాలు అంటగడుతారు. వీడికి అలాంటి డైలాగ్స్ ఇస్తే చేస్తాడా? ఇది చేస్తే అది చేయడు అని అనుమాన పడుతుంటారు. దానివల్ల నేను కొన్ని వేషాలు వదులుకొన్నాను.

    పరిశ్రమపై అధిపత్యం తగ్గింది

    పరిశ్రమపై అధిపత్యం తగ్గింది

    టాలీవుడ్‌లో పరిస్థితి మెరుగుపడింది. తెలంగాణలో పది మంది టాప్ డైరెక్టర్లు ఉన్నారు. ఆంధ్రా నుంచి పదిమంది టాప్ డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పడు ఏకచ్ఛాత్రాధిపత్యం పోయి బ్యాలెన్స్ అయిపోయింది. కథ బాగుంటేనే సినిమా చూస్తున్నారు. RX 100, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు ఎంత పెద్ద హిట్లుగా మారాయో మీకు తెలుసు.

    తెలంగాణలోనూ కమర్షియల్ హీరోలు

    తెలంగాణలోనూ కమర్షియల్ హీరోలు

    ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రలో కమర్షియల్ హీరోలు ఉన్నారు. తెలంగాణలో నితిన్‌తోపాటు విజయ్ దేవరకొండ, కార్తీకేయ లాంటి హీరోలు వస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరి స్థానానికి గ్యారెంటీ లేదు. ఆ విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలి. నేను ఏ పాత్రకు కావాల్సి ఉందని డైరెక్టర్లు పిలిస్తే నాకు గౌరవం దక్కినట్టే.

    English summary
    Bluffmaster, directed by Gopi Ganesh, is the Telugu remake of Sathuranga Vettai, a heist thriller. Satya Dev and Nandini Swetha are lead pair. 30 years Industry Pruthvi will be seen in important role. This movie is set to release on December 28th. In this occassion, Pruthvi speaks to Telugu Filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X